‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్..దాదాపు పదేళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్‌లో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ..తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో తన పౌరసత్వం గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.
ఇండియన్ కాదా?
అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా లోని సాన్ జోస్ నగరంలో జన్మించారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్‌కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. ఆయనకు అమెరికా పాస్‌పోర్ట్ కూడా లభించింది. చిన్ననాటి విద్యను హైదరాబాద్‌లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్, కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. తిరిగి హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యను పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు.
కొద్ది రోజుల్లో భారతీయుడిని అవుతాను
తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడిన అఖిల్.. ‘ప్రస్తుతం నేను అమెరికన్ పౌరుడినే. నా వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే త్వరనే ఆ పౌరసత్వాన్ని వదులుకుంటాను. ఇంకొన్ని నెలల్లో నేను భారతీయుడిని అయిపోతాను. ఇండియన్ మేరా భారత్ మహాన్’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.
I will be Indian citizen soon.. మేర భారత్ మహాన్ - అఖిల్ pic.twitter.com/SWyjQQwIvr
— Mr. Akkineni (Sai) (@AkkineniFF) July 24, 2026


