ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)
2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్‌సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!)


