ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు | Ott Movies Telugu Streaming June 19th 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies: ఒకేరోజు ఓటీటీల్లో 16 మూవీస్ స్ట్రీమింగ్.. ఆ ఐదు స్పెషల్

Jun 18 2026 8:23 PM | Updated on Jun 18 2026 8:33 PM

Ott Movies Telugu Streaming June 19th 2026

మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు, కాక్‌టెయిల్ 2 లాంటి డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే 16కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)

ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే దృశ్యం 3 అందుబాటులోకి రాగా, అతిరథి, రేజర్, ధురంధర్ 2, ఎమ్4ఎమ్ చిత్రాలతో పాటు సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఏమైనా సడన్ సర్‌ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 19)

హాట్‌స్టార్

  • సేవ్ ద టైగర్స్ 3 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • అతిరథి - తెలుగు డబ్బింగ్ మూవీ

  • తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 - హిందీ సిరీస్

ఆహా

  • రేజర్ - తెలుగు సినిమా

  • థ్యాంక్యూ సుబ్బారావ్ - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • ధైర్యే సాహసే అమృత - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్

  • మనితన్ దైవమగళం - తమిళ మూవీ

  • గిన్నీ వెడ్స్ సన్నీ 2 - హిందీ చిత్రం

  • దృశ్యం 3 - తెలుగు డబ్బింగ్ సినిమా (‍ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్

  • ధురంధర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

  • వాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే - ఇంగ్లీష్ మూవీ

  • హస్బెండ్స్ ఇన్ యాక్షన్ - కొరియన్ సినిమా

  • ఒయాసిస్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఐ విల్ ఫైండ్ యూ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

సన్ నెక్స్ట్

  • ఆషాన్ - మలయాళ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • ఎమ్4ఎమ్ - తెలుగు సినిమా

  • ఆలియా బసు గాయబ్ హై - హిందీ మూవీ

  • మ్యాచ్ పాయింట్ - ఇంగ్లీష్ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • షుగర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

మనోరమ మ్యాక్స్

  • గు - మలయాళ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • అబ్ హోగా హిసాబ్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement