హర్ముజ్‌లో ఉద్రిక్తత.. భారతీయులున్న నౌకపై దాడి! | strait of hormuz tanker attacks 29 indian seafarers safe | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో ఉద్రిక్తత.. భారతీయులున్న నౌకపై దాడి!

Oct 31 2026 4:30 AM | Updated on Oct 31 2026 4:47 AM

strait of hormuz tanker attacks 29 indian seafarers safe

టెహ్రాన్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు విధులు నిర్వహిస్తున్న నౌకలపై జరుగుతున్న దాడులను ఇటీవలే భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే హర్ముజ్‌ జలసంధిలో మరోసారి భారతీయులున్న నౌకపై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.  ఆ వివరాలను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి  వెల్లడించారు.
 

ఏం జరిగింది?
అక్టోబర్ 30న పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ లూయిస్ 1 (MT LOUISE 1) అనే చమురు ట్యాంకర్‌పై లింపెట్ మైన్లతో దాడి జరిగింది. ఈ నౌకలో 27 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఈ దాడి కారణంగా నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో ట్యాంకర్ కొంతసేపు పనిచేయకుండా నిలిచిపోయింది. అయితే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

 సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో నౌక తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించిందని ఈ వివరాలను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి  సర్బానంద సోనోవాల్ తెలిపారు. దానితో పాటు అక్టోబర్ 29న మరో నౌకపై కూడా దాడి జరిగినట్లు పేర్కొన్నారు. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ అర్జానా (MT ARZANAH) అనే భారీ చమురు రవాణా నౌక పై హర్ముజ్ జలసంధిలో ప్రక్షేపకంతో దాడి జరిగిందని పేర్కొన్నారు.

ఈ నౌకలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ రెండు నౌకల్లో కలిపి మొత్తం 29 మంది భారతీయులు ఉండగా, వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని  నౌకల నిర్వహణ సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, పేర్కొన్నారు. ఈ వివరాలను ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ఇదీ చదవండి: జీ- 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement