జీ 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు | g20 ministers skip photo op in iran as russia ukraine war creates rifts | Sakshi
Sakshi News home page

జీ 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

Oct 31 2026 3:00 AM | Updated on Oct 31 2026 3:00 AM

g20 ministers skip photo op in iran as russia ukraine war creates rifts

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ వేదికలపై నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.  రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కలిసి గ్రూప్ ఫొటోలో కనిపించేందుకు కొందరు ఐరోపా దేశాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  సంప్రదాయంగా నిర్వహించే గ్రూప్ ఫొటో కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు. 

శుక్రవారం అట్లాంటాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సహా ఇతర దేశాల ప్రతినిధులతో పాల్గొన్నారు. ప్రపంచం ప్రస్తుతం కీలకమైన మలుపులో ఉందని, భౌగోళిక రాజకీయ సంక్షోభాలను పరిష్కరించేందుకు దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రూబియో పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా సభ్య దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో  రష్యా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగడం తమకు ఇష్టం లేదని కొందరు ఐరోపా దేశాల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు నిర్వహించాల్సిన సంప్రదాయ గ్రూప్ ఫొటో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఏడాది జరిగిన గత జీ20 సమావేశాల్లోనూ ఐరోపా నాయకులు రష్యా ప్రతినిధులతో కలిసి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాను దౌత్యపరంగా దూరంగా ఉంచుతున్నాయి.

ఈ ఫొటో కార్యక్రమం రద్దుపై అమెరికా అధికారి ఒకరు స్పందిస్తూ, వివాదాస్పద పరిస్థితుల కారణంగానే కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. కేవలం ఒక ఆచారపూర్వక ఫొటో కార్యక్రమం దౌత్యపరమైన చర్చలను పక్కదారి పట్టించే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


ఇదీ చదవండి: శక్తివంతంగా ఉంటేనే శాంతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement