గాయపడ్డ సైనికుడికి డ్రోన్‌ రక్ష!  | Ukraine military started using specialized aerial rescue drones | Sakshi
Sakshi News home page

గాయపడ్డ సైనికుడికి డ్రోన్‌ రక్ష! 

Oct 28 2026 6:18 AM | Updated on Oct 28 2026 6:18 AM

Ukraine military started using specialized aerial rescue drones

ఉక్రెయిన్‌ చేతిలో ‘స్టార్‌గేట్‌’ 

ఆరు రోటర్ల డ్రోన్‌తో రక్షణ చర్యలు సులువు

కీవ్‌: ఐదేళ్లుగా సాగుతూనే ఉన్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రష్యా సరిహద్దుల్లో గాయాలతో రెండు రోజులుగా కదల్లేకపోయిన ఇద్దరు సైనికులను తాము ప్రత్యకమైన డ్రోన్‌ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు మిలటరీ అధికారులు ప్రకటించారు. గాయపడ్డ సైనికులను యుద్ధ క్షేత్రం నుంచి తరలించేందుకు డ్రోన్‌ను వాడటం ప్రపంచంలోనే ఇది మొదటిసారి అవుతుంది. 

స్టార్‌గేట్‌ అని పిలుస్తున్న ఈ డ్రోన్‌ను స్కైఫాల్‌ అనే సంస్థ అభివృద్ధి చేసినట్లు సమాచారం. మొత్తం ఆరు రోటర్లు ఉండే దీంట్లో చిన్న క్యాప్సూల్‌ లాంటి నిర్మాణం ఉంటుంది. గత వారం రోజుల్లో రెండుసార్లు ఈ డ్రోన్‌ సాయంతో గాయపడ్డ సైనికులను ఆసుపత్రులకు తరలించినట్లు 475 స్పెష్‌ అసాల్ట్‌ రెజిమెంట్‌ అధికారులు తెలిపారు. ‘‘గాయంతో నా పాదం సగం తెగిపోయింది. రక్తం విపరీతంగా పోయింది. నడిచే పరిíస్థితిలో లేను. ఎవరైనా నన్ను తరలిస్తారేమో అని రెండు రోజులు ఎదురు చూశా. కానీ చివరకు నన్ను రక్షించేందుకు డ్రోన్‌ వచ్చింది’’అని 24 ఏళ్ల సైనికుడు ఒకరు ఆసుపత్రి నుంచి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు.

 ఈ యువ సైనికుడు ఫస్ట్‌ టెరిటోరియల్‌ డిఫెన్స్‌ బ్రిగేడ్‌కు చెందిన వాడని, లైజమ్‌ అన్న మిలటరీ పేరు ఉన్నవాడని అధికారులు చెప్పారు. ‘‘ఆ డ్రోన్‌ రాకపోయి ఉంటే... అక్కడి నుంచి బయటపడటం నాకు సాధ్యమయ్యేదే కాదు’’అని లైజమ్‌ స్పష్టం చేశారు. నారింజ రంగు స్ట్రెచర్‌తో కూడిన ఆ స్టార్‌గేట్‌ డ్రోన్‌ ఏపుగా ఎదిగిన గడ్డి పొదల్లో ల్యాండ్‌ అయ్యిందని, డ్రోన్‌లోని ఫైబర్‌ ఆప్టిక్‌ స్పూల్‌ కేబుల్‌కు గడ్డి చుట్టుకుపోవడంతో అక్కడే ఇరుక్కుపోతుందని తామంతా భయపడ్డామని లైజమ్, అతడి సహచరులు తెలిపారు. అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరక్కపోగా లైజమ్‌తోపాటు అది 15 నిమిషాల్లో సురక్షిత ప్రాంతానికి చేరుకుంది. లైజమ్‌ మాదిరిగానే మరో సైనికుడు ఆర్టెమ్‌ కూడా తీవ్రంగా గాయపడి రష్యా సరిహద్దులకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా స్టార్‌గేట్‌ డ్రోన్‌ రక్షించింది. ఈ డ్రోన్‌ సుమారు 150 కిలోల బరువు మోయగలదు. అలాగే దీంట్లో సిగ్నల్‌ జామర్లతోపాటు తనంతట తాను దారి చూసుకుని ప్రయాణించగల వ్యవస్థలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement