రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ | first tanker carrying Russian diesel to the US under a new import agreement has set sail | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌

Oct 24 2026 6:11 AM | Updated on Oct 24 2026 6:11 AM

first tanker carrying Russian diesel to the US under a new import agreement has set sail

40 వేల టన్నులడీజిల్‌తో బయలుదేరిన  మొదటి ట్యాంకర్‌ 

7న న్యూయార్క్‌  చేరుకోనున్న చమురు నౌక 

మాస్కో: కొత్త దిగుమతి ఒప్పందం ప్రకారం రష్యా నుంచి మొట్టమొదటి డీజిల్‌ ట్యాంకర్‌ అమెరికాతో బయలుదేరిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ శుక్రవారం ప్రకటించింది. ఇకపై తమ అంతర్జాతీయ వినియోగదారులకు క్రమం తప్పకుండా చమురు రవాణా కొనసాగుతుందని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్‌ వివరించారు. ఇంతకుమించి వివరాలను పెష్కోవ్‌ వెల్లడించలేదు. మొదటి ట్యాంకర్‌లో 40 వేల టన్నులు అంటే సుమారు 3 లక్షల బారెళ్ల డీజిల్‌ ఉంటుందని వారం క్రితం రష్యా ఉప ప్రధాని నొవాక్‌ తెలిపారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. అమెరికా రోజువారీ డీజిల్‌ వాడకం 40 లక్షల బారెళ్ల మేర ఉంటుందని అంచనా. 

బాలి్టక్‌ సముద్ర నౌకాశ్రయం ప్రిమోర్‌స్క్‌ నుంచి ఈ నెల 22న బయలుదేరిన ఈ ట్యాంకర్‌ నవంబర్‌ 7వ తేదీన న్యూయార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని మెరైన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ కెప్లెర్‌ తెలిపింది. కాగా, 2023 జూలై తర్వాత రష్యా నుంచి అమెరికాకు వస్తున్న మొట్ట మొదటి నౌక ఇదే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై దురాక్రమణ చేపట్టిన రష్యాపై అమెరికా సహా పశి్చమదేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెల్సిందే. అయినప్పటికీ, దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, మధ్యంతర ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ట్రంప్‌ రెండు వారాల క్రితం రష్యాతో ఇంధన ఒప్పందానికి పచ్చజెండా ఊపారు. మారిన అమెరికా వైఖరి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సాగిస్తున్న దురాక్రమణకు ఊతమిచ్చేలా ఉందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ట్రంప్‌ పట్టించుకోలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement