సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్ | Military solutions will not work Jaishankar | Sakshi
Sakshi News home page

సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్

Oct 31 2026 7:44 AM | Updated on Oct 31 2026 7:44 AM

Military solutions will not work Jaishankar

అట్లాంటా: అంతర్జాతీయ సమస్యలు సైనిక చర్యలతో పరిష్కారం కావని, వివాదాల పరిష్కారానికి దౌత్యానికి అవకాశం ఇవ్వాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య నౌకలు, నావికులపై దాడులను నిలిపివేయాలని, సముద్ర ప్రయాణ స్వేచ్ఛను కాపాడాలని కోరారు.

అంతర్జాతీయ చట్టాలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్‌సీఎల్‌ఓఎస్‌) ప్రకారం నౌకాయాన భద్రతను పరిరక్షించాలన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా 22 మంది భారతీయులు, వారిలో 14 మంది నావికులు మరణించినట్లు తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామిక అభివృద్ధికి మార్కెట్ అడ్డంకులు, సరఫరా వ్యవస్థలపై ఆంక్షలు ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధ్యక్షత వహించారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో మియామీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 

ఇదీ చదవండి: Delhi: షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement