Summer Care సన్‌స్క్రీన్‌ వాడాలా? వద్దా? | Summer Care Sunscreen Essential Tips for Healthy Skin | Sakshi
Sakshi News home page

Summer Care సన్‌స్క్రీన్‌ వాడాలా? వద్దా?

May 3 2025 11:18 AM | Updated on May 3 2025 12:52 PM

Summer Care Sunscreen Essential Tips for Healthy Skin

సమ్మర్‌ (Summer)లో సన్‌స్క్రీన్‌  (Sunscreen) లోషన్‌ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్‌ మార్కెట్‌ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్‌లో ఒకవర్గం సన్‌స్క్రీన్‌ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?


ప్రధానంగా రెండు రకాల సన్‌స్క్రీన్‌లు ఉన్నాయి. 1. మినరల్‌ 2. కెమికల్‌
మినరల్‌ సన్‌స్క్రీన్‌లో జింక్‌ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌లాంటి క్రియాశీల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి యువి కిరణాలను నిరోధిస్తాయి. ఇక కెమికల్‌ సన్‌స్క్రీన్‌లు అధికశక్తి గల యూవీ కిరణాలను గ్రహిస్తాయి. చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవేకాకుండా మార్కెట్‌లో కాంబినేషన్‌ సన్‌స్క్రీన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.డెర్మటాలజిస్ట్‌లు ‘సన్‌స్క్రీన్‌ వాడడం మంచిదే’ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘సన్‌స్క్రీన్‌లోని ఇన్‌గ్రేడియెంట్స్‌ థైరాయిడ్‌ హార్లోన్లు, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్‌ స్థాయులను దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి తక్కువస్థాయి ఆధారాలతో కూడిన ప్రాథమిక అధ్యయనాలు మాత్రమే. అందువల్ల సన్‌స్క్రీన్‌లు ఎండోక్రైన్‌ డిస్ట్రప్టర్లు అని నిర్దారించడానికి ఈ ఆధారాలు సరిపోవు’ అంటున్నారు డెర్మటలాజిస్ట్, ఇన్‌ఫ్లూయెంజ్‌ స్కిన్‌ అండ్‌ హేర్‌ క్లినిక్‌ ఫౌండర్‌ గీతికా శ్రీవాస్తవ.

ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

జింక్‌ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌ ఇన్‌గ్రేడియెంట్స్‌ ఉపయోగించే ఫిజికల్‌ సన్‌స్క్రీన్స్‌ (మినరల్‌ సన్‌స్క్రీన్స్‌) సురక్షితమైనవని, ప్రభావ వంతవైనవని ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌–రిసెర్చ్‌) నిర్ధారించింది. 

చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

Advertisement
 
Advertisement
Advertisement