పల్నాడు, సాక్షి : పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి మారుతి షిప్ట్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు మృతి చెందారు. తీవ్ర గాయాపాలైన ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తెలిసిందే.
గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.
గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్‌ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్‌లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య


