జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది | Without Going To Gym Woman weight came down From 95 Kg To 65 Kg | Sakshi
Sakshi News home page

జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

Jul 7 2025 3:48 PM | Updated on Jul 7 2025 5:31 PM

Without Going To Gym Woman weight came down From 95 Kg To 65 Kg

అధిక బరువుకు కారణాలనేకం.  జీవన శైలి, ఆహార అలవాట్లు,   కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో   చాలా మంది  అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు.  అయితే  ‘‘చిన్నప్పటినుంచీ   నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు.  అలా జిమ్‌ కెళ్లకుండానే  95 కిలోల  వెయిట్‌  నుంచి 65 కిలోలకు  చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.

ఇది ఉదితా అగర్వాల్  వెయిట్‌ లాస్‌  జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం.  ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే  కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్  కేవలం ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన  విజయాన్ని సాధించింది.

ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు

ఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్‌వాంటెడ్‌ హెయిర్‌ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే  95 కిలోల బరువున్న ఉదితా  65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది.

 తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా  "బరువు తగ్గడంలో జంక్‌ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద  చాలెంజ్‌’’ అని  ఆమె చెప్పుకొచ్చింది.

చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
ఉదిత వెయిట్‌ లాస్‌లో సాయపడిన అలవాట్లు
డీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్  తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్,  సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్‌ మీల్‌ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.
ఒక్కోసారి వెయిట్‌ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు  ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.
ఇంటి ఫుడ్‌:  ఇంట్లో  ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. 
చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున  రోజంతా తాగేది.  
రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement