గాజా శాంతిపై ఇజ్రాయెల్ ప్రధాని వివరణ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు.
భారత్, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రెండు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.


