ట్రంప్‌ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు | PM Benjamin Netanyahu Reacts On US Bombing Iran Nuclear Sites, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు

Jun 22 2025 8:40 AM | Updated on Jun 22 2025 12:22 PM

PM Benjamin Netanyahu on us Bombing Iran Nuclear Sites

టెల్ అవీవ్: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ద యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా దళాలు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. ట్రంప్‌ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ వ్యాఖ్యానించారు.

అధ్యక్షుడు ట్రంప్, తాను తరచూ బలప్రయోగం ద్వారా  శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటామని,  మొదట బలప్రయోగం జరిగితే, తరువాత శాంతి ఉద్భవిస్తుందన్నారు. డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ తమ శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించాయని నెతన్యాహు అన్నారు. కాగా ఫోర్డోపై ఆరు బంకర్-బస్టర్ బాంబులను వేశామని, ఇతర అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించామని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్‌’కు తెలిపారు. యుద్ధంలో ట్రంప్‌ సహకారంపై స్పందిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.

ఆపరేషన్ రైజింగ్ లైన్‌లో ఇజ్రాయెల్  తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా ఏ ఇతర దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్  ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన పాలనను,  ప్రమాదకరమైన ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించే విధంగా వ్యవహరించారని చరిత్రలో నమోదవుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. దేముడు అమెరికాను, ఇజ్రాయెల్‌ను దీవించాలని, మన బలిష్టమైన కూటమిని, అచంచలమైన విశ్వాసాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని నెతన్యాహు అన్నారు.

ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్‌ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

Advertisement
 
Advertisement
Advertisement