breaking news
nuclear sites details
-
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్‌లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్?
టెహ్రాన్: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణుకేంద్రాలపై భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా జోక్యంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై వైమానికదాడులు జరిగిన దరిమిలా రేడియేషన్ ముప్పుపై సర్వత్రా ఆందోళన నెలకొంది.ఈ దాడుల అనంతరం ఈ అణుకేంద్రాల సమీపంలోని వారికి ఎటువంటి హాని జరగలేదని ఇరాన్ అణు నియంత్రణ అధికారులు తెలిపారు. అమెరికా దాడి చేసిన అణు కేంద్రాలలో రేడియేషన్ కలిగించే పదార్థాలు లేవని ఇరానియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దాడుల అనంతరం కాలుష్య కారక సంకేతాలు నమోదు కాలేదని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ కేంద్రం తెలిపింది. ఈ దాడుల నేపధ్యంలో రేడియేషన్ స్థాయిలలో పెరుగుదల కనిపించలేదని యూఎన్ అణు వాచ్డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ధృవీకరించింది.యూఎస్ దాడులకు ముందు కూడా ఇరానియన్ సైట్లపై ఇజ్రాయెల్ దాడులకు దిగినప్పుడు కూడా రేడియేషన్ భయాలు రేకెత్తాయి. అణు సౌకర్యాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏనాడో హెచ్చరించింది. కాగా ఈ అణుకేంద్రాలపై దాడుల తరువాత సమీప ప్రాంత ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. దేశంలోని యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుండి బదిలీ చేశారని, రేడియేషన్‌కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ డిప్యూటీ హెడ్ హసన్ అబేది తెలిపారు.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్ -
‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. తాజాగా ఇరాన్ అణుశక్తి సంస్థ (ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్) ఆదివారం తెల్లవారుజామున తమ దేశంలోని మూడు అణుశక్తి కేంద్రాలపై జరిగిన దాడులను ధృవీకరించింది. ఈ విధంగా అణుకేంద్రాలపై దాడులు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల కారణంగా ఎంత నష్టం జరిగిందో స్పష్టం చేయకుండా, దాడుల వివరాలను ప్రకటించారని ఇరాన్ పేర్కొంది. అణు కేంద్రాలపై సాగించిన దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకువస్తుందని టెహ్రాన్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ అణుశక్తి సంస్థపై శత్రువుల కుట్రలు సాగుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రయత్నాలతో ఏర్పడిన ఈ జాతీయ పరిశ్రమ అభివృద్ధిని ఆపబోమని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్లో సంభాషిస్తూ జియోనిస్ట్ పాలనలోని దురాక్రమణకు తమ ప్రతిస్పందన మరింత వినాశకరంగా ఉంటుందని హెచ్చరించారని అధికారిక ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్ నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని పర్వతాలలోగల అణు కేంద్రంపై అమెరికా దాడి చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు -
ట్రంప్ చరిత్రను తిరగరాశారు: నెతన్యాహు
టెల్ అవీవ్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ద యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా దళాలు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. ట్రంప్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ వ్యాఖ్యానించారు.అధ్యక్షుడు ట్రంప్, తాను తరచూ బలప్రయోగం ద్వారా శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటామని, మొదట బలప్రయోగం జరిగితే, తరువాత శాంతి ఉద్భవిస్తుందన్నారు. డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ తమ శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించాయని నెతన్యాహు అన్నారు. కాగా ఫోర్డోపై ఆరు బంకర్-బస్టర్ బాంబులను వేశామని, ఇతర అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించామని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’కు తెలిపారు. యుద్ధంలో ట్రంప్ సహకారంపై స్పందిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు.ఆపరేషన్ రైజింగ్ లైన్లో ఇజ్రాయెల్ తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై.. అమెరికా ఏ ఇతర దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, ప్రమాదకరమైన ఆయుధాల వినియోగాన్ని తిరస్కరించే విధంగా వ్యవహరించారని చరిత్రలో నమోదవుతుందని నెతన్యాహు పేర్కొన్నారు. దేముడు అమెరికాను, ఇజ్రాయెల్‌ను దీవించాలని, మన బలిష్టమైన కూటమిని, అచంచలమైన విశ్వాసాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని నెతన్యాహు అన్నారు.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు? -
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు.. అణు శాస్త్రవేత్తలు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగించారు. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో.. -
ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..
టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.ఇరాన్లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్‌లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్‌లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్ఐఎస్)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్‌లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్‌ని అదే కాపాడిందా? -
'అణు' వివరాలు పంచుకున్న భారత్, పాక్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌లు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరోసారి కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో మాదిరిగానే ఇరు దేశాల్లో ఉన్న అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఆదివారం దీనికి సంబంధించిన హామీ పత్రాలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. ఇలా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరగడం ఇది 26వసారి. తొలిసారి 1992 జనవరి 1న ఈ ఒప్పందం ప్రారంభమై గత ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఉన్న అణు సౌకర్యం ఉన్న స్థావరాలపైగానీ, అణ్వాయుధాలపైగానీ దాడి చేయరాదు. దీనికి సంబంధించి తొలి అడుగు 1988లో పడింది. అదే ఏడాది డిసెంబర్ 31ని ఇరుదేశాల మధ్య సంతకాలు జరిగాయి. అయితే జనవరి 27, 1991న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా తొలి ఏడాది ఒప్పంద పత్రాల మార్పిడి 1992, జనవరి 1న జరిగింది. అప్పటి నుంచి ప్రతి జనవరి 1న ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలు మార్చుకుంటుంటారు.