‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్‌.. | Like Absolute Butter Trump on How US Struck Irans Fordow Nuclear Site | Sakshi
Sakshi News home page

‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్‌..

Jun 30 2025 7:31 AM | Updated on Jun 30 2025 7:32 AM

Like Absolute Butter Trump on How US Struck Irans Fordow Nuclear Site

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్‌లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని  వ్యాఖ్యానించాయి.

ట్రంప్‌ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్‌) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు  అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు.  ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.
 

ఫోర్డో అణుకేంద్రం ఇరాన్‌లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్‌ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం  నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్‌(ఇరాన్‌)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్‌ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై  అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.

ఇది  కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే..

Advertisement
 
Advertisement
Advertisement