
టెలీ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా బందీల విడుదల సక్రమంగా జరగని పక్షంలో హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం, నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ చెరలో ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకువస్తాం. తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో సాధ్యమైనంత వరకు బందీలను విడిపిస్తాం. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదు. తాత్కాలిక కాల్పుల విరమణ మా ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని సాధించకుండా నిరోధించింది. ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత హమాస్ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాతో చర్చలు జరిపారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించింది. చర్చల తర్వాత 60 రోజుల కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం.
గాజాలో పూర్తి నిరాయుధీకరణ, సైనికీకరణను తొలగించడం, బంధీలను విడుదల చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 60 రోజుల సమయంలో ఇవన్నీ జరిగితే ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయదు. ఒకవేళ హమాస్ కనుక మళ్లీ కాల్పులు విరమణను ఉల్లంఘిస్తే.. ఈసారి ఇజ్రాయెల్ దాడులు మరింత బలంగా ఉంటాయి. హమాస్‌ను లేకుండా చేసి ఇజ్రాయెల్ భద్రతను పునరుద్ధరించే వరకు మేము ఆగము’ అని హెచ్చరించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యోధుల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. మేము హమాస్ సైనిక సామర్థ్యాలను చాలావరకు నిర్వీర్యం చేశాం. హమాస్ విషయంలో మేము దౌత్యం, సైనిక శక్తి కలయిక ద్వారా పనిచేయాలనుకుంటున్నాము. దౌత్యం పని చేయకపోతే సైనిక శక్తి తమ పని తాము చూసుకుంటుందని హెచ్చరించారు. ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందని స్పష్టం చేశారు.
Benjamin Netanyahu:
"The war ends only if Hamas surrenders, Gaza is demilitarized, and if it can be done in negotiations, good. If not, it will be done with force by our great Israeli army. Hamas will be gone from Gaza at the end of the war either way."pic.twitter.com/RkMANr0ilV— Vivid.🇮🇱 (@VividProwess) July 10, 2025