హిజ్బుల్లాకు ఇజ్రాయెల్‌ ప్రధాని హెచ్చరిక | netanyahu warning to hezbollah | Sakshi
Sakshi News home page

హిజ్బుల్లాకు ఇజ్రాయెల్‌ ప్రధాని హెచ్చరిక

Sep 22 2024 9:04 PM | Updated on Sep 22 2024 9:35 PM

netanyahu warning to hezbollah

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాకు హెచ్చరించారు. హిజ్బుల్లాకు పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబనాన్, బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది.

ఈ దాడిపై నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాను  ఊహించలేని విధంగా దెబ్బ కొట్టాం. హిజ్బుల్లాకి ఇప్పటికీ అర్థం గాకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అని అన్నారు. 

శనివారం ఇజ్రాయెల్‌ 290 హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది. అంతకు ముందు శుక్రవారం బీరుట్ శివారులో చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో హిజ్బుల్లా కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, హిజ్బుల్లా దళాలు వినియోగించే పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ కమ్యూనికేషన్‌ కోసం వినియోగించే పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్‌ పేల్చిందని హిజ్బుల్లా ఆరోపిస్తుంది. 

చదవండి : కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష

Advertisement
 
Advertisement
Advertisement