మధుమేహం (డయాబెటిస్) వల్ల కలిగే అంధత్వాన్ని ముందుగానే గుర్తించే కంటి పరీక్షను ఇజ్రాయెల్ బృందం రూపొందించింది.ఒక్క నిమిషంలో చేసే కంటి పరీక్షతో మధుమేహ అంధత్వాన్ని ముందే గుర్తించే టెక్నాలజీని ఇజ్రాయెల్ రూపొందించింది. మధుమేహం ఉన్నవారు తరచుగా నిర్లక్ష్యం చేసే కంటి పరీక్ష, ఇప్పుడు సాధారణ వైద్య పరీక్షల సమయంలో నర్సు తీసే ఒక చిన్న ఫోటోతోనే పూర్తవుతుంది.
ఇజ్రాయెల్ కంపెనీ AEYE హెల్త్ AI-శక్తితో కూడిన కంటి స్క్రీనింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది మధుమేహ సంబంధిత కంటి వ్యాధి సంకేతాలను ఒక నిమిషంలో గుర్తించగలదు, ప్రతి కన్ను ఫోటోను ఉపయోగించి! ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లో మధుమేహం ఉన్న 256 మంది పాల్గొన్న ఒక అధ్యయనంలో,చికిత్స అవసరమైన నలుగురు రోగులను గుర్తించడం విశేషం.
ఏఐ హెల్త్ ఈ వ్యాధిని గుర్తించే ప్రక్రియను ఒక నర్సు తీయగలిగే సాధారణ ఫోటోగా మార్చేసింది. ఈ కెమెరా చేతిలో ఇమిడిపోయేంత చిన్నదిగా, రెండు పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఉంటుంది. నర్సు దీనిని కంటి దగ్గర ఉంచి, కంటి వెనుక భాగంలో చూపుకు ప్రధాన కారణమైన 'రెటీనా' ఒక్కో ఫోటోను తీస్తుంది. కొన్ని సెకన్లలోనే తెరపై ఎరుపు (Red) లేదా ఆకుపచ్చ (Green) రంగు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్తే ఏడాది తర్వాత మళ్లీ పరీక్షకు రమ్మని అర్థం. ఎరుపు రంగు వస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలని అర్థం. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం ఒక నిమిషం మాత్రమే పడుతుంది. 10 మందిలో 9 మందికి కంటిలో చుక్కల మందు (eye drops) వేయాల్సిన అవసరం లేకుండానే ఈ పరీక్ష పూర్తవుతుంది, పైగా గదిలో కంటి వైద్యుడు ఉండాల్సిన అవసరమే లేదు.
ఇదీ చదవండి: విషాదం : తెల్లవారితే పెళ్లి..తిరిగిరాని లోకాలకు టెకీ!
పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తి కలిగిన AI వ్యవస్థకు అమెరికా ఎఫ్‌డిఏ (FDA) ఇప్పటికే రెండుసార్లు ఆమోదం తెలిపింది. ఒకసారి టేబుల్‌పై ఉంచే కెమెరాకు, మరోసారి చేతిలో పట్టుకునే (handheld) కెమెరాకు. అంతేకాకుండా, ఉత్తమ డిజిటల్ హెల్త్ టెక్నాలజీ విభాగంలో 2026 ప్రిక్స్ గాలియన్ (Prix Galien USA) అవార్డును కూడా ఈ సంస్థ గెలుచుకుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తనాళాలు దెబ్బతిని 'డయాబెటిక్ రెటినోపతి' ఏర్పడుతుంది. ప్రారంభ దశలో దీనికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఈ ఒక్క నిమిషం పరీక్ష ద్వారా వ్యాధిని ముందే గుర్తించి శాశ్వత అంధత్వాన్ని నివారించవచ్చని ఇజ్రాయెల్‌లోని షెబా మెడికల్ సెంటర్ (Sheba Medical Center) అధ్యయనాలలో నిరూపితమైంది.
ఇదీ చదవండి: ఆఫీసులో ఉద్యోగిని ‘పటాకా’ డ్యాన్స్ : నెటిజన్ల స్పందన మాత్రం!


