‘రోజంతా కోర్టులో కూర్చోబెడతారా’: నెతన్యాహు కేసుపై ట్రంప్‌ ఆగ్రహం | Trump Defends Israels Benjamin Netanyahu | Sakshi
Sakshi News home page

‘రోజంతా కోర్టులో కూర్చోబెడతారా’: నెతన్యాహు కేసుపై ట్రంప్‌ ఆగ్రహం

Jun 29 2025 8:54 AM | Updated on Jun 29 2025 12:15 PM

Trump Defends Israels Benjamin Netanyahu

వాషింగ్టన్: ఇరాన్‌పై దాడుల అనంతరం అమెరికా ఇజ్రాయెల్‌ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతుగా నిలిచారు. అతనిపై వచ్చిన అవినీతి అరోపణలపై జరుగుతున్న విచారణ  అర్థంలేనిదన్నారు. ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌లో చేసిన ఒక పోస్ట్ లో ఇజ్రాయెల్ ప్రధానిపై  చేస్తున్న ఆరోపణలు భయంకరమైనవిగా పేర్కొన్నారు.

2019లో ఇజ్రాయెల్‌లో లంచం, మోసం, నమ్మక ద్రోహం ఆరోపణలతో తనపై మోపిన పలు అభియోగాలను ప్రధాని నెతన్యాహు ఖండించారు. ఈ అభియోగాలపై 2020లో విచారణ ప్రారంభమైంది. వీటిలో మూడు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కాగా ఈ అవినీతి కేసులో తాను సాక్ష్యం చెప్పడాన్ని వాయిదా వేయాలని నెతన్యాహు కోరగా, కోర్టు దానిని తిరస్కరించింది. ‘ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్య చాలా దారుణం. ఆయన ఒక యుద్ధ వీరుడు, ఇరాన్‌ నుంచి పొంచివున్న అణు ముప్పును తొలగించడంలో అమెరికాతో కలిసి  పనిచేసిన ప్రధాని అని’ ట్రంప్ పేర​్కొన్నారు.

నెతన్యాహు ప్రస్తుతం హమాస్‌తో ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని, బందీలను తిరిగి తీసుకురావడంపై కూడా చర్చిస్తున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను రోజంతా కోర్టు గదిలో కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుంది? అని ట్రంప్‌ ప్రశ్నించారు. ట్రంప్ దీనిని రాజకీయ వేటగా పేర్కొన్నారు. ఇది న్యాయం పేరుతో జరుగున్న అపహాస్యమని అన్నారు. ప్రధాని నెతన్యాహు నాయకత్వంలో తాము గొప్ప విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. నెతన్యాహును 2024లో నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులకు సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించారు. వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Shefali Death: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్‌ తీసుకున్నాక..

Advertisement
 
Advertisement
Advertisement