గ్యాంగ్‌టక్: కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. పురాతన సిల్క్ రూట్ (Silk Route) చారిత్రక మార్గంలో భాగమైన నాథూలా పాస్ ఈ వాణిజ్యం ఆగస్టు 1, 2026 నుండి పునఃప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ దౌత్యపరమైన ముందడుగుతో సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్ ద్వారా భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం నాథులా తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కీలా, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ తదితర హిమాలయ సరిహద్దు మార్గాలను దశలవారీగా తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాథూలా సిల్క్ ప్రత్యేకత
ఇది ప్రాచీన 'సిల్క్ రూట్' (పట్టుదారి) మార్గంలో అత్యంత కీలకమైన భాగం. ఒకప్పుడు భారత్ నుండి టిబెట్ (చైనా) మధ్య ప్రధాన వాణిజ్యం ఈ మార్గం గుండానే జరిగేది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న మోటారు మార్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు ముఖాముఖిగా కనిపిస్తారు. సరిహద్దు కంచెను తాకి చూసే అవకాశం ఉండటంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
నాథులా పాస్ అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఇది ఏడాది పొడవునా తెరిచి ఉండదు డిసెంబర్ నుండి మార్చి వరకు ఉన్న శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది (కొన్నిసార్లు -25°C వరకు). రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోవడం వల్ల ప్రయాణం పూర్తిగా అసాధ్యం అవుతుంది.


