ఇజ్రాయెల్‌ ప్రధాని కీలక నిర్ణయం.. అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం | Israel pm Benjamin Netanyahu announces ban on Al Jazeera | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ప్రధాని కీలక నిర్ణయం.. అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం

May 5 2024 6:07 PM | Updated on May 8 2024 4:15 PM

Israel pm Benjamin Netanyahu announces ban on Al Jazeera

హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్‌ నెటవర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్‌ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.  

‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్‌ నెట్‌వర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేదిస్తున్నాం. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్‌ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ​ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్‌ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్‌ తిరస్కరించారు. హమాస్‌ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్‌ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. 

మరోవైపు.. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్‌, ఈజిప్ట్‌, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్‌ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement