వెస్ట్‌ బ్యాంక్‌ జెనీన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు.. | Israeli Airstrike In Gaza West Bank City Of Jenin Kills 6, Including Kids And UN Worker | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బ్యాంక్‌ జెనీన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు.. పలువురు మృతి

Published Sat, Jul 6 2024 7:23 AM | Last Updated on Sat, Jul 6 2024 10:11 AM

Israeli Airstrike In Gaza West Bank city of Jenin

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెస్ట్‌ బ్యాంక్‌ నగరం జెనిన్‌ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఇక, చనిపోయిన వారిలో ఇస్లామిక్‌ జిహాద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ జరిగిన వైమానిక దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందినట్టు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే, ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని సెటిల్‌మెంట్లలో దాదాపు 5,300 భవానాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్‌ యాంటీ సెటిల్‌మెంట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ తెలిపిన మరుసటి రోజే ఇలా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా పేర్కొంది.

 

ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన నాటి నుంచి వెస్ట్‌ బ్యాంక్‌ సిటీలో హింస చెలరేగింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ కాల్పుల్లో 500 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, హింసాత్మక ఘటనల సమయంలో చాలా మంది మరణించారు. చనిపోయిన వారిలో యూదు వలసదారులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement