
ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు ఎంతో పరిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలోని వాతావరణానికి ముగ్ధులువుతుంటారు. ప్రశాంతతకు ఇస్కాన్ ఆలయం చిరునామా అని చెబుతుంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్ ఆలయంలో ప్రశాంతతను భంగపరిచే ఉదంతం చోటుచేసుంది. అది వైరల్‌గా మారింది.
లండన్‌లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక యువకుడు కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌తో ప్రాంగణంలోకి ప్రవేశించి, దానిని తినడం మొదలుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇదొక రెచ్చగొట్టే చర్యగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా అభివర్ణించారు. వైరల్‌గా మారిన ఆ వీడియోలో గోవింద రెస్టారెంట్‌కు చికెన్ తీసుకువచ్చిన ఆ యువకుడు అక్కడి సిబ్బందితో ‘మాంసాహారం ఉందా?’ అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ రెస్టారెంట్‌లో శాఖాహార వంటకాలు మాత్రమే ఉంటాయని తెలియగానే, ఆ యువకుడు కేఎఫ్‌సీ అతను కేఎఫ్‌సీ బాక్స్ నుండి చికెన్‌ను తీసి, కౌంటర్ దగ్గరే తినడం ప్రారంభిస్తాడు.
SHOCKING NEWS 🚨 African-British man forcibly eats chicken at ISKCON Govinda’s restaurant in London.
MAN (Enters): Only veg food here?
STAFF: Yes, only vegetarian food. What would you like?
Then he pulled out KFC chicken and began eating it inside 😳
He even offered the… pic.twitter.com/ISWyTwwBf0— Times Algebra (@TimesAlgebraIND) July 20, 2025
తరువాత అతను తన దగ్గరునున్న చికెన్‌ను అక్కడున్న అందరికీ చూపిస్తాడు. ఇంతలో అక్కడి సిబ్బంది అతనిని వారించగా, అతను వారితో వాగ్వాదానికి దిగుతాడు. దీంతో వారు సెక్యూరిటీ సాయంతో అతనిని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తారు. ఇస్కాన్‌లోకి చికెన్ తెచ్చిన యువకునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అతనిపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు దీనిని జాతివివక్ష చర్యగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసివుంటారని ఆశిస్తున్నానని ఒక యూజర్ పేర్కొన్నారు. హిందువులు ప్రతీకారం తీర్చుకోరని భావించిన అతను ఈ పనికి పాల్పడి ఉంటాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.