
వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్‌లోనిని ఈస్టమ్‌లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.