తొలి ఏకాదశి సందర్బంగా లండన్‌లో SVBTCC ఆధ్వర్యంలో బాలాజీ కల్యాణం | Toli ekadashi 2025 celebrated in balaji temple At london | Sakshi
Sakshi News home page

Toli ekadashi 2025 SVBTCC ఆధ్వర్యంలో లండన్‌లో బాలాజీ కల్యాణం

Jul 10 2025 10:56 AM | Updated on Jul 10 2025 10:56 AM

Toli ekadashi 2025 celebrated in balaji temple  At london

తొలి ఏకాదశి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) — లండన్‌ లోని బాలాజీ దేవాలయం - ఒక వైభవమైన శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. లోడన్ వ్యాలీ లెజర్ సెంటర్, రెడింగ్ — SVBTCC ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా భక్తులు హాజరై పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, మరియు హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ లాంటి ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేకంగా గౌరవించారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

వేడుకల్లో భాగంగా పిల్లలు మరియు నిపుణుల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక గౌరవంతో, సముదాయ భావంతో   సాగింది.

భక్తుల నుంచి వచ్చిన భారీ   స్పందనకు  SVBTCC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.  స్వదేశానికి దూరంగా ఉన్నా కూడా, పవిత్ర  తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నామనీ, లండన్‌ లోని బాలాజీ దేవాలయంలో ఈ వేడుక నిర్వహించటం మాకు గర్వకారమని అని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ డయాస్పోరా యొక్క స్థిరమైన సాంస్కృతిక విలువలకు గుర్తుగా నిలిచిందన్నారు లండన్‌లోని ఆధ్యాత్మిక , సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో SVBTCC పాత్రను మరోసారి  చాటుకుందని భక్తులు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement