breaking news
Toli Ekadasi
-
తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు తొలి ఏకాదశి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
Toli Ekadashi 2025: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి. చదవండి: హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం? సీతమ్మ సత్కారం -
తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.ఏకాదశి విశిష్టత..కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏం చేయాలి..?ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!) -
తొలి ఏకాదశి ఆలయంలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..
సాక్షి, కురవ(వరంగల్) : పండుగ ఆ ఇంట్లో చీకట్లను నింపింది.. తొలి ఏకాదశి పర్వదినం ఆ ఇంటికి దుర్ధిన్నాన్ని తెచ్చిపెట్టింది.పండుగ కావడంతో బడికి సెలవు ఇచ్చారు.. బడి ఉంటే బతికేటోళ్లు కదా బిడ్డాలారా.. అంటూ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు గుండెల్నిపిండేసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతనూరి శ్రీను, హైమ ల కుమారులు సూర్యతేజ(8) మూడో తరగతి, విశాల్(5) ఒకటో తరగతి చదువుతున్నారు. వీరి స్వగ్రామం తొర్రూరు మండలం వెంకటాపురం కాగా బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం మోద్గులగూడెంలో ఉంటున్నారు. తిర్మలాపురంలోని తిరుమల వర్మీ కంపోస్టు తయారీ కేంద్రంలో గత సంవత్సర కాలంగా పనిచేస్తూ కుటుంబంతోసహా అక్కడే నివాసముంటున్నారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండడంతో సూర్యతేజ, విశాల్, మరో స్నేహితుడు పుల్సర్ ఈశ్వర్‌తో కలిసి పాఠశాలకు ఎదురుగా ఉన్న మర్రికుంటలో ఈతకు వెళ్లారు. సూర్యతేజ, విశాల్‌లు కుంటలోకి దిగారు. నీరు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ అందులో మునిగిపోయారు. దీంతో ఒడ్డు మీదున్న స్నేహితుడు ఈశ్వర్ పరుగెత్తుతూ వచ్చి గ్రామస్తులకు విషయాన్ని చెప్పాడు. గ్రామస్తులు కుంట వద్దకు వెళ్లేసరికే అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న కురవి ఎస్సై నాగభూషణం శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం పరిశీలించారు. గ్రామంలో విషాదఛాయలు అన్నదమ్ములిద్దరూ కుంటలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బడి ఉంటే బతికేటోళ్లు కదరా బిడ్డలూ అంటూ తల్లి హైమ రోదిస్తున్నతీరు చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కడుపున పుట్టిన ఇద్దరు కుమారులు ఒకే రోజు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చుడం ఎవరివల్ల కాలేదు. -
తొలి ఏకాదశి భక్తులతో ఆలయాలు కిటకిట
-
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం స్థానికులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం మహిళలు భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో వేకువజామున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణవాడలోని పండరినాథ్, బాలేశ్వర, షిర్డీ సాయిబాబా, మార్కం డేయ స్వామి, శివకేశవ మందిరాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భజనలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా అర్చకుడు ఢిల్లీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఏకాదశి పదకొండు సంఖ్యలకు సంకేతమని, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు, వెరసి పదకొండింటిపైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నదే ఈ పండగ సందేశమన్నారు.