
సాక్షి, తాడేపల్లి: నేడు తొలి ఏకాదశి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025