breaking news
Sri Venkateswara Balaji Temple
-
తొలి ఏకాదశి సందర్బంగా లండన్లో SVBTCC ఆధ్వర్యంలో బాలాజీ కల్యాణం
తొలి ఏకాదశి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) — లండన్ లోని బాలాజీ దేవాలయం - ఒక వైభవమైన శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. లోడన్ వ్యాలీ లెజర్ సెంటర్, రెడింగ్ — SVBTCC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా భక్తులు హాజరై పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, మరియు హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ లాంటి ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేకంగా గౌరవించారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పిల్లలు మరియు నిపుణుల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక గౌరవంతో, సముదాయ భావంతో సాగింది.భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందనకు SVBTCC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి దూరంగా ఉన్నా కూడా, పవిత్ర తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నామనీ, లండన్ లోని బాలాజీ దేవాలయంలో ఈ వేడుక నిర్వహించటం మాకు గర్వకారమని అని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ డయాస్పోరా యొక్క స్థిరమైన సాంస్కృతిక విలువలకు గుర్తుగా నిలిచిందన్నారు లండన్లోని ఆధ్యాత్మిక , సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో SVBTCC పాత్రను మరోసారి చాటుకుందని భక్తులు కొనియాడారు. -
లండన్లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు
శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ బ్రాక్నెల్లోని మొదటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం 30 మార్చి 2024న ప్రారంభించింది. పురాతన హిందూ గ్రంధాలు, శిల్ప స్థాపత్య శాస్త్రాలను అనుసరించి రెండు రోజుల పాటు ప్రారంభ వేడుకలు వరుస శుభ కార్యక్రమాలతో నిర్వహించారు. శ్రీ శ్రీనివాస శర్మ, ప్రధానార్చకులు, పలువురు అర్చకుల చేత ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగాయి. లండన్లో చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని స్థాపించాలనే వారి విస్తృత ఆశయాన్ని సాకారం చేయడంలో ఇది ప్రారంభ మైలురాయిగా ఉంటుందని ఆలయ నిర్వాహకులు ఆనందం వ్యక్తపరిచారు. SVBTCC ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, కృష్ణ కిషోర్, సురేష్ రెడ్డి, కమలా కోట చర్ల, ప్రవీణ్ మస్తీ, సురేష్ గోపతి, భాస్కర్ నీల మరియు పావని రెడ్డి సహా ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు తుకారాం రెడ్డి, రవి వాసా, రవి శ్రీరంగం, వంశీ వి, వంశీ బి, విశ్వేశ్వర్ గోవర్ధన్, రాఘవేంద్ర, గౌతం శాస్త్రి మరియు గోపి కొల్లూరు సంఘం సభ్యులు, వాలంటీర్లు , భక్తులకు తమ గణనీయ సహకారం అందించినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. వీరందరి సహకారంతో ఈ కార్యం సాధ్యమైందని కొనియాడారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లండన్లోని ఈ ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం, సాయంత్రం భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లండన్లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)