
న్యూయార్క్ నగరంలో ఆర్థిక అసమానతలను రూపుమాపుతానంటూ సోషలిస్ట్ తరహా వాగ్దానాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ మేయర్ అభ్యర్థి జొహ్రాన్ ఖ్వామీ మమ్దానీ(33)పై విమర్శల దాడి పెరిగింది. భారతీయ మూలాలున్న మమ్దానీ తల్లిదండ్రులు మీరా నాయర్, మహూమ్ద్ మమ్దానీల ఆస్తిపాస్తుల వివరాలనే అస్త్రాలుగా మార్చుకున్న విమర్శకులు.. ఆయనకు సోషలిజం (Socialism) గురించి మాట్లాడే అర్హత లేదని దెప్పి పొడుస్తున్నారు. మమ్దానీ కుటుంబ నేపథ్యానికి, ఆయనిస్తున్న వాగ్దానాలకు పొంతనే లేదంటున్నారు.
జొహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani)కి ఉగాండాలో ఉన్న నాలుగెకరాల ప్లాట్ విలువే 2.50 లక్షల డాలర్ల ఖరీదుంటుందని, ఖరీదైన మన్‌హట్టన్ ప్రాంతంలో విలాస వంతమైన నివాస భవనముందని చెబుతున్నారు. మమ్దానీ కుటుంబానికి 10 లక్షల డాలర్ల దాకా విలువైన ఆస్తులున్నాయని ట్రంప్ తరఫున లారా లూమర్, మెఘన్ మెక్‌కెయిన్ తెలిపారు.
ఉన్నత విద్య, పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన జొహ్రాన్ మమ్దానీకి సగటు ఉద్యోగికి ఉండే ఇబ్బందులేమీ లేవని, ఇటువంటి వ్యక్తి సామాన్యుల ఇబ్బందులను ఎలా తీరుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలు మరో నాలుగు నెలలుండగా, మమ్దానీపై విమర్శలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.
చదవండి: నీ భార్య నిన్ను వదిలి వెళ్లిపోతుంది