న్యూయార్క్ నగరంలో చంపేస్తోంది. ఈ వీకెండ్ అనగా ఆదివారం తీవ్రమైన చలి నమోదైంది. 3 డిగ్రీల ఫారెన్‌హీట్‌కి తగ్గిపోయాయి. బలమైన చలిగాలుల వల్ల ఈ చలి.. -14 డిగ్రీలలా అనిపిస్తోంది. ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలి.. -40 డిగ్రీలు అనిపించేంతలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా న్యూయార్క్, ఫిలడెల్ఫియా లాంటి పెద్ద నగరాల్లో కలిపి 4.3 కోట్లమందికి పైగా ప్రజలకు.. తీవ్ర చలి హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా వైపు నుంచి వచ్చిన ఆర్కిటిక్ గాలులే ఈ తీవ్రమైన చలికి కారణమని వాతావరణ నిపుణులు అన్నారు. గత 10-20 ఏళ్లలో లేనటువంటి చలి ఇది అని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అంటార్కిటికాలోని మెక్‌మర్డో స్టేషన్‌లో.. న్యూయార్క్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది.
ఈ చలి కారణంగా న్యూయార్క్ సిటీలో ఈ ఏడాది ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో కనీసం 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో 13 మంది హైపోథర్మియా(చలి) వల్లే చనిపోయారట.
The beautiful lake in #NYC’s Central Park looks very frozen and frosty today. #NewYork #NewYorkCity pic.twitter.com/JMsKEVdkTo
— Inga Sarda-Sorensen (@isardasorensen) February 8, 2026
Alerta de frío extremo en la Ciudad de Nueva York EEUU 🇺🇸
Y los vientos no trataron muy bien a los turistas.#newyorkcity
Vía @ImMeme0 pic.twitter.com/luofBYaBBm— Geól. Sergio Almazán (@chematierra) February 8, 2026


