ట్రంప్‌ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో | Donald Trump Post Barack Obama AI Video Backlash Details | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో

Jul 21 2025 8:20 AM | Updated on Jul 21 2025 10:51 AM

Donald Trump Post Barack Obama AI Video Backlash Details

సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్‌ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అరెస్ట్‌ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేయడం గమనార్హం. 

ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్‌. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం.

 

 అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్‌ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్‌ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్‌ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. 

 

 

ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన  మరుసటిరోజే ట్రంప్‌ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement