అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. యుద్ధనౌక కూల్చివేతపై ఇరాన్‌ | Iran israel And US war live update On 05th March 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. యుద్ధనౌక కూల్చివేతపై ఇరాన్‌

అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

  • సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వం: ఇరాన్‌
  • యూఎస్‌, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తాం
  • హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ హక్కు మాదే: ఇరాన్‌
2026-03-05 15:33:45

ఖతార్‌ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
  • దోహాతో పాటు దుబాయ్‌పై ఇరాన్‌ దాడులు
  • డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌
     
2026-03-05 15:22:51

సైనిక సంఘ‌ర్ష‌ణ‌లు వ‌ద్దు: భారత ప్ర‌ధాని మోదీ

  • ప‌శ్చిమాసియాలో శాంతికి న‌రేంద్ర మోదీ పిలుపు
  • సైనిక సంఘ‌ర్ష‌ణ‌ల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావన్న ప్ర‌ధాని మోదీ
  • దౌత్య చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించాల‌ని సూచ‌న‌
  • శాంతిస్థాప‌నకు సంబంధించిన అన్ని చ‌ర్య‌లకు భార‌త్ స‌హ‌క‌రిస్తుందని మోదీ హామీ
2026-03-05 14:57:28

అజర్‌బైజాన్‌ విమానాశ్రయం సమీపంలో ఇరాన్‌ క్షిపణులు

  • ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లు అజర్‌బైజాన్‌లోని నఖ్చివాన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పడ్డాయని రాయిటర్స్ నివేదిక
  • ఈ ఘటనలో మంటలు చెలరేగాయి, కొంత మౌలిక సదుపాయాలకు నష్టం.. ఇద్దరికి గాయాలు

 

2026-03-05 14:55:29

హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌ కీలక ప్రకటన

  • జలసంధిని నియంత్రించే అధికారం మాకుంది
  • అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదు
  • యూఎస్‌, ఇజ్రాయెల్‌, యూరప్‌ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ
  • ఇరాన్‌ ప్రకటనతో భారత్‌ సహా పలు దేశాలకు ఊరట
2026-03-05 14:29:13

3వేల మంది ఇరాన్‌ సైనికుల దుర్మరణం

  • తాము జరిపిన దాడిలో 3వేల మంది ఇరాన్‌ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ అంచనా

  • మీడియా సంస్థ వైనెట్ అంచనాల ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికన్ వైమానిక దళ దాడులలో మరణించినట్లు సమాచారం 

2026-03-05 14:22:18

బహ్రెయిన్ -ఖతార్, అజర్ బైజాన్‌లో ఇరాన్ దాడి

  • బహ్రెయిన్ -ఖతార్, అజర్ బైజాన్‌లో ఇరాన్ దాడి

  •  బహ్రెయిన్, ఖతార్‌లలో  పేలుళ్లు జరిగినట్లు నివేదించిన సబ్రిన్ వార్తా సంస్థ  

  • అదే సమయంలో అజర్ బైజాన్‌లో కూడా ఇరాన్‌ దాడి చేసిందని వెల్లడి 

2026-03-05 14:19:01

యుద్ధనౌక పేలిన ఘటనపై స్పందించిన ఇరాన్‌

  • ఇజ్రాయెల్, అమెరికన్ స్థావరాలపై ఇరాన్ కొత్త దాడులు ప్రారంభం

  • హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను పేల్చినందుకు అమెరికా తీవ్రంగా చింతిస్తుంది’ అని బెదిరింపులు

  • హిందూ మహాసముద్రంలో మంగళవారం రాత్రి యుఎస్ నావికాదళం ఇరాన్ యుద్ధనౌకను ధ్వంసం చేసింది

  • డజన్ల కొద్దీ ఇరాన్ నావికులను చంపింది 

  • ఈ ఘటనపై స్పందించిన ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందన 

  • మా ప్రతి దాడులతో అమెరికా బాధపడటం ఖాయం

2026-03-05 12:34:17

ఇరాన్‌పై యుద్ధం వేళ అమెరికా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం

  • గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అణు వార్‌హెడ్ లేకుండా మినిట్‌మన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

  • లక్ష్యాన్ని విజయవంతంగా చేరిన క్షిపణి

  • సిస్టమ్ సిద్ధతను ధృవీకరించడానికి చేసిన రొటీన్ పరీక్ష

2026-03-05 12:34:17

ఇరాన్‌పై అనవసరంగా యుద్ధం చేస్తాన్నామా? ..అంతర్మధనంలో అమెరికా

  • అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడుతోంది అంటూ ఇరాన్‌ ప్రకటన

  • శ్రీలంక వద్ద సముద్రంలో తమ యుద్ధనౌకపై దాడికి ఇరాన్‌ స్పందన

  • ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పోస్టు

     

     

2026-03-05 12:07:00

ఇరాన్‌పై 5వేల బాంబులతో ఇజ్రాయెల్‌ దాడులు

  • రెండు వారాల పాటు కొనసాగనున్న దాడులు 

  • దాడులపై చర్చించుకున్న అమెరికా-ఇజ్రాయెల్‌

2026-03-05 12:07:00

భారీ ఖంఢాతర క్షిపణిని పరీక్షించిన అమెరికా

  • కాలిఫోర్నియాలోని వాండెన్‌బెర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి మినిట్‌మ్యాన్‌-3 పరీక్ష

  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అమెరికా

2026-03-05 12:07:00

అమెరికా బేస్‌లపైకి ఐఆర్‌జీసీ ప్రయోగం

  • క్షిపణులు,డ్రోన్లను సంయుక్తంగా అమెరికా బేస్‌లపైకి ఐఆర్‌జీసీ ప్రయోగం
2026-03-05 12:07:00

అమెరికా నావల్‌ బేస్‌లపై ఇరాన్‌ దాడులు

  • అమెరికా నావల్‌ బేస్‌లపై ఇరాన్‌ దాడులు 

  • దాడుల్లో ధ్వంసమైన అమెరికా నావల్‌ బేస్‌లు 

  • ఇరాన్‌పై యుద్ధం చేసేందుకు అమెరికా.. భారత్‌ నావల్‌ బేస్‌లను వినియోగిస్తోందంటూ ప్రచారం 

  • ప్రచారాన్ని ఖండించిన భారత్‌ 

  • అమెరికన్‌ మీడియా అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ భారత్‌ అధికారిక ప్రకటన విడుదల 

2026-03-05 09:47:22

ఇరాన్ క్షిపణి హెచ్చరిక.. జెరూసలేంలో పేలుళ్లు

  • ఇరాన్ క్షిపణి దాడి గురించి ఇజ్రాయిల్‌ హెచ్చరికలు

  • హెచ్చరికల అనంతరం గురువారం జెరూసలేంలో పేలుళ్లు 

  • ఇరాన్ క్షిపణి ప్రయోగాల గురించి ఇజ్రాయెల్ సైన్యం రెండు గంటల్లోపు మూడు వేర్వేరు హెచ్చరికలను జారీ 

  • హెచ్చరికలు జారీతో తప్పిన ప్రాణ నష్టం 

  • గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్‌ క్షిపణుల దాడి 

  •  ఈ దాడితో టెల్ అవీవ్‌తో సహా అనేక ప్రాంతాలలో  రెడ్ అలర్ట్ జారీ

2026-03-05 09:47:22

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు

  • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు 

  • ‌టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపిన ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ 

  • టెహ్రాన్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇరాన్ తన రక్షణను వేగవంతం చేసిందని తెలిపిన తస్నిమ్‌ 

  • గురువారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్‌పై అనేక రౌండ్ల క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఈ పేలుళ్లు సంభవించినట్లు వెల్లడి

2026-03-05 09:47:22

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

  • ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు 

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

  • సెనెట్‌లో వీగిపోయిన విపక్షాల తీర్మానం

  • ఇరాన్‌పై యుద్ధంలో కాంగ్రెస్‌ అనుమతి లేకుండా బలగాలను వాడకూడదని విపక్షాల తీర్మానం

2026-03-05 08:45:10

ఇరాన్‌ను కాపీ కొట్టిన అమెరికా.. అదే దేశంపై ప్రయోగం

  • ఇరాన్‌ తక్కువ వ్యయంతో షాషెద్‌-136 డ్రోన్ల తయారీ

  • టార్గెట్‌ చేరగానే పేలిపోయి భారీ నష్టాన్ని కలిగించేలా ఆత్మాహుతి డ్రోన్‌

  • ఆత్మాహుతి డ్రోన్‌ను అడ్డుకోవాలంటే అతి ఖరీదైన క్షిపణులు అవసరం

  • అదే క్షిపణులను రివర్స్‌ ఇంజినీరింగ్‌ చేసిన అమెరికా

  • అతి తక్కువ ధరకే లూకస్‌పేరుతో  ఇరాన్‌ షాషెద్‌-136 డ్రోన్‌ తరహా డ్రోన్‌ తయారీ

  • సుమారు 10 అడుగుల పొడవు

  • 8 అడుగుల రెక్కల పొడవుతో డ్రోన్‌ తయారీ

  • ఇదే డ్రోన్లనే ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరీలో భాగంగా ఇరాన్‌పై అమెరికా ప్రయోగం

  • పైలెట్లకు ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా ప్లాన్‌

  • 800 కిలోమీటర్ల దూరం ఇరాన్‌లోని తన లక్ష్యాలపై దాడి  చేసిన అమెరికా

  • అమెరికా కొత్త వ్యూహంలో భాగంగా, తక్కువ ఖర్చుతో, త్వరగా తయారయ్యే డ్రోన్లు

  • శత్రు టెక్నాలజీని (ఇరాన్ షాహెద్‌ డ్రోన్లు) తీసుకుని దానిని మెరుగు పరిచిన అమెరికా

  • తద్వారా తన సైనిక శక్తిని పెంచేందుకు అమెరికా యత్నం

  • సాధారణంగా డ్రోన్‌ అభివృద్ధి ప్రక్రియ 6 సంవత్సరాలు

  • కానీ 18 నెలల్లోనే పూర్తి చేసిన అమెరికా

2026-03-05 07:57:22

భారత్‌,చైనాకు ముడి చమురు ఇస్తామని రష్యా హామీ

  • ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు 

  • మౌలిక సదుపాయాలపై  దెబ్బ కొట్టిన ఇరాన్‌

  • హర్మూజ్‌ జల సంధిని ఆదీనంలోకి తీసుకున్న ఇరాన్‌ 

  • నౌకలు ఆగిపోవడంతో తలెత్తిన ఆయిల్‌ సంక్షోభం

  • ఆయిల్‌ సంక్షోభంతో పలు దేశాలు ఆందోళన 

  • ఆందోళన వేళ అయిల్‌ సంక్షోభంపై రష్యా కీలక ప్రకటన

  • భారత్‌,చైనాకు ముడి చమురు ఇస్తామని రష్యా హామీ

2026-03-05 07:57:22

అమెరికా దాడుల్ని తిప్పికొట్టిన ఇరాన్‌ సైన్యం

  • బాస్రాకు దక్షిణంగా ఉన్న జుబైర్ జిల్లా ప్రాంతంలో దాడులకు ప్రయత్నించిన అమెరికా

  • రెండు క్షిపణులను మోసుకెళ్లే మొబైల్ రాకెట్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాకీ భద్రతా దళాలు

  • రాకెట్ ప్రయోగ ప్రయత్నాన్ని భగ్నం చేశాయని నివేదించిన రాయిటర్స్

  • ఇరాకీ నేషనల్ సెక్యూరిటీ సర్వీస్ అందించిన ఖచ్చితమైన నిఘా ఆధారంగా జరిగిన సీక్రెట్‌ ఆపరేషన్‌  

2026-03-05 07:20:12

ఇరాన్‌పై దాడుల్ని ఉదృతం చేసిన ఇజ్రాయెల్‌

  • ఇరాన్‌ నాయకత్వం,భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు

  • ఇరాన్‌ సైనిక కేంద్రంపై విమానాలు,బాంబులతో  ఇజ్రాయెల్‌ దాడులు

  • ఇప్పటి వరకు 300పైగా ఇరాన్‌ రక్షణ వ్యవస్థలు ధ్వంసం

  • దాడుల్లో వెయ్యిమందికిపైగా ఇరాన్‌ ప్రజలు మృతి
     

2026-03-05 07:20:12

ఇరాన్‌పై యుద్ధం ముగియలేదు: ట్రంప్‌

  • ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరు అద్భుతం 

  • అమెరికా సైన్యం ట్రంప్‌ ప్రశంసలు

  • ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా ఉండాలనుకునే వారి ప్రాణాలు తీస్తామని ట్రంప్‌ ప్రకటన 

2026-03-05 07:20:12
Advertisement
 
Advertisement
Advertisement