
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో(Donald Trump) పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి(Benjamin Netanyahu) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌నకు మోదీ అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మోదీ వెల్లడించారు.
ఇక, అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా(Gaza Peace) శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను ట్విట్టర్ వేదికగా మోదీ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రధాని మోదీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన స్నేహితుడు మోదీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని కూడా నెతన్యాహు తాత్కాలికంగా ఆపేసుకున్నారు. హమాస్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ భేటీ అయ్యింది. ఇందులో నెతన్యాహుతో సహా పలు కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మరీ మోదీతో మాట్లాడారు. బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం తెలిపింది.