
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్‌గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి.
మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్‌లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి.
🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV
— Breaking911 (@Breaking911) June 19, 2025
అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్‌లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.
🚨
The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel
By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.
And you still ask why we don’t want them to have nuclear weapons…
👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025
ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్‌నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.
ఇరాన్‌లో భయానక నిశ్శబ్దం
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్‌లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్‌ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్‌పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.