breaking news
Operation Rising Lion
-
ఇరాన్ అణు ముప్పును తొలగించాం: నెతన్యాహు
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ అణు-క్షిపణి ముప్పును తొలగించడంలో విజయం సాధించాం అని పేర్కొన్నారాయన. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ‘‘ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించాం. తద్వారా ముప్పును తొలగించగలిగాం. ఈ విషయంలో సహకరించడంతో పాటు రక్షణ సహకారం అందించిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ఈ విజయానికి ప్రతిగా.. ట్రంప్‌నకు పూర్తి సహకారం అందిస్తాం. ఆయన ప్రతిపాదించిన పరస్పర కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం.’’ అని నెతన్యూహు పేర్కొన్నారు. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక ఇజ్రాయెల్ ధీటుగానే స్పందిస్తుందని ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే నెతన్యాహు అణు ముప్పు తొలగిందన్న వ్యాఖ్యలకు ఇరాన్ స్పందించాల్సి ఉంది.12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తొలుత ఇరాన్ ఈ ప్రకటనను తోసిపుచ్చుతూ.. భిన్నమైన ప్రకటనలు చేసింది. ఈలోపు మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యుద్ధం కొనసాగుతోందని అంతా భావించారు. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే కాల్పుల విరమణ మొదలైందని టెహ్రాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించగా.. కాసేపటికే ఇజ్రాయెల్ కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. 24 గంటల్లో తొలి 12 గంటలు ఇరాన్ కాల్పుల విరమణ పాటించాలి. ఆ తర్వాత 12 గంటలు ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటిస్తుంది. దీంతో కాల్పుల విమరణ ఒప్పందం సంపూర్ణంగా అమలు అయినట్లే. అయితే ఇది శాశ్వత పరిష్కారమా? కాదా? అనేదానిపై మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నో సీజ్ ఫైర్ ట్రంప్.. అంతా తుస్!!
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్‌లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. -
భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్.. దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్ అవీవ్ మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 🚨#UltimoMinuto | 🇮🇷 #Tehran pic.twitter.com/BWz8bA5NDW— INTERACTIVA NEWS (@interactivanew) June 23, 2025ఇరాన్ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్జీసీ, పోలీస్ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కథనాలు ఇస్తోంది. ఇవెన్ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.👇జూన్ 13, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.ఇరాన్‌లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.👇జూన్ 14, 2025ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి.టెల్ అవీవ్, జెరూసలెం, రమత్‌గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.ఇజ్రాయెల్ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.👇జూన్ 15, 2025ఇరాన్ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.ఇరాన్ సైనిక జనరల్స్ బ్రిగేడియర్ మెహ్రబి, రబ్బాని మరణించారు.👇జూన్ 16, 2025ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.👇జూన్ 17, 2025ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.టెహ్రాన్‌లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.👇జూన్ 18, 2025ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.టెల్ అవీవ్, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.👇జూన్ 19, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.ఇరాన్ కమ్యూనికేషన్ హబ్‌లు, రాడార్ కేంద్రాలపై దాడులు.ఇరాన్ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.👇జూన్ 20, 2025ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరాలపై దాడి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.👇జూన్ 21–22, 2025పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఇరాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.✈️ దాడి వివరాలు:7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.👇జూన్ 23, 2025టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.ఇరాన్ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్‌హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్రెజా జోల్ఫాఘరీ, అమీర్‌హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్‌కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక.. ఇజ్రాయెల్ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్ అవీవ్ సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా. -
ఇరాన్ జెండాలతో వైట్‌హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.#همین_حالا مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025రష్యా, చైనా వైఖరేంటి?ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఆందోళనలో భారత్?భారత్‌కు ఇజ్రాయెల్, ఇరాన్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. -
క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్‌లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్‌గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023 -
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
టెలీ అవీవ్: ఇరాన్‌తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్‌తో యుద్ధం కారణంగా వాయిదా పడింది. -
ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్‌గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్‌లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్‌లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్‌లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్‌లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్‌నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్‌లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్‌ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్‌పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. -
‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్‌పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్‌లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్‌కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్‌కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు. -
కాల్పుల విరమణ కాదు.. ట్రంప్ రియల్ ఎండ్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..ట్రంప్ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్‌తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట జూన్ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్‌కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్ సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు.న్యూక్లియర్ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్.. టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్ రూమ్‌లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ -
ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్‌ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్‌పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్‌లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్‌పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్‌ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్ లైన్ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్‌లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్ స్పష్టీకరణ -
‘భయంతో చచ్చిపోతున్నాం’.. భారతీయుల తరలింపునకు కేంద్రం ఆపరేషన్!
సాక్షి, ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.The advisory issued in view of the current situation in Iran.All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్‌లోని షాహిద్ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.మరోవైపు.. ఇరాన్లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్‌లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
ఇరాన్‌కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తమపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్ అణు దాడులకు దిగుతుందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్ యూటర్న్ తీసుకుంది.ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్(పాక్) కూడా టెల్‌అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్ వెల్లడించారు.అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అబ్బే.. అలా అనలేదుఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండిచింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్‌కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌కు తాము మద్దుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది. భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్‌పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి. -
Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. !
ఇజ్రాయిల్ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇరాన్లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన తర్వాత ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై ఈరోజు(శనివారం) ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్‌లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్ ప్లేస్‌లో ఉన్నాం. దయచేసి మీరు కామ్‌గా ఉండండి’ అంటూ టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టీయూఎంఎస్) అధికారులు చెప్పినట్లు కశ్మీర్ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరి 5.5 ఎంబీఎస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరాన్‌లోని టెహ్రాన్‌కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్‌కు సదరు అసోసియేషన్ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మరొకవైపు ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. -
Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..
దాడులు చేయడమే తప్ప.. దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్(Iron dome). నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. ఇరాన్ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ సైన్యం(IDF). ప్రతిగా ఇరాన్ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ.. క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్ అవీవ్‌లో.. అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది.#BreakingNews Iron Dome Blasts Iranian Drone Out Of The Sky#Israel #Iran #IsraeliranWar #israil #Tehran #Teheran #TelAviv #deathtoamerica #irannucleardeal #AsadabadRegion #IronDome pic.twitter.com/wEV5FsM2qD— Shekhar Pujari (@ShekharPujari2) June 14, 2025ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను చీల్చుకుంటూ మరి మిస్సైల్స్ దూసుకెళ్లాయి. Last night strike on Tel aviv.Follow us for for all latest updates #middleeast #riyadh #jeddah #IranNuclearSecrets #USA #Israel #SaudiArabia #UAE #iran #tehran #tahran #russia #ukraine#telAviv #MissileAttack #Irondome pic.twitter.com/sRvxNzvXPy— Bharat - As it is (@NewBharatVoice) June 14, 2025పెద్ద శబ్దంతో.. దూసుకొచ్చిన మిస్సైల్ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెల్ అవీవ్‌కు తలమానికంగా భావించే కీర్యా ప్రాంతంను చూడొచ్చు. ఇరాన్ మిస్సైల్స్‌ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిస్సైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ పవిఫలమైంది. ఐరన్ డోమ్ ఉండేది అక్కడే..ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒకే దశలో ఉండదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి.. వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర.ఇక.. చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పని చేసేది ఎలాగంటే..ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం. రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.సక్సెస్ రేటుపై అనుమానాలా?2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం. అయితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులను, తాజా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ తడబడింది. -
ఇరాన్‌కు టెన్షన్.. ఖమేనీ టార్గెట్‌గా విరుచుకుపడిన ఇజ్రాయెల్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్‌లో ఒకరు మృతి చెందగా.. 39 మంది గాయపడినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.మరోవైపు.. ఇరాన్ మిలిటరీ చీఫ్‌గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. గుటెర్రస్ ట్విట్టర్ వేదికగా.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గంలో చర్చలు జరపాలన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు. -
ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..
ఇరాన్ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్ దాకా ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. -
ఆపరేషన్ రైజింగ్ లయన్.. రేడియేషన్ రిలీజ్ అయ్యిందా?
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్డేట్స్అణు ధార్మికత విడుదలైందా?ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులుకీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడాదీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారంఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణఅణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన ఒక్క విమానం తిరగట్లేదు!!ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలంఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్‌రాడర్24As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights. NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్‌పై దాడి పూర్తి!ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్‌లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్వంద డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యండ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్ రైజింగ్ లయన్‌పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతిదాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతిఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభంఇరాన్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్‌లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
ఇరాన్‌కు భారీ షాక్.. ఆర్మీ చీఫ్, అణు శాస్త్రవేత్తలు మృతి!
జెరూసలెం: పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై ఒక్కసారిగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ మరణించినట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర టాప్ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. BREAKING:Iran confirms that Israel has killed:– Hossein Salami (the IRGC’s Commander-in-Chief)– Gholam-Ali Rashid (the Armed Forces Strategic Commander)– Dr. Tehranchi (The project supervisor in the Amad Plan to develop nuclear weapons and project supervisor for… pic.twitter.com/y7FoHHJ7Ga— Visegrád 24 (@visegrad24) June 13, 2025ఇరాన్‌పై కొద్ది రోజుల్లోనే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా సాయం లేకుండానే ఈ దాడులు జరగనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్‌పై వందల బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని స్పష్టంచేశారు.🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025 అమెరికా అప్రమత్తంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తమ సైనిక, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని సిబ్బందిని తగ్గించాలని సూచించారు. బహ్రెయిన్, కువైట్‌లలోనూ అత్యవసరం కాని సిబ్బందిని తగ్గించాలని ఆదేశించారు. వారంతా ఆయా దేశాలను వీడేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికీ హెచ్చరికలు జారీ అయ్యాయి. -
‘ఇజ్రాయెల్ దాడులు’.. ఇరాన్‌లోని భారతీయులకు అడ్వైజరీ
ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భయానక దాడులు చేస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. ట్విట్టర్ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అడ్వైజరీలో పేర్కొంది.The Embassy of India in Iran posts an advisory for Indian nationals living in Iran."In view of the current situation in Iran, all Indian nationals & persons of Indian origin in Iran are requested to remain vigilant, avoid all unnecessary movements, follow the Embassy’s Social… pic.twitter.com/nxgvL0AtDZ— ANI (@ANI) June 13, 2025మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ విమాన రాకపోకలపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశాలకు, ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎయిర్ లైన్స్‌ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. -
ఇజ్రాయెల్ మరో యుద్ధం.. ఇరాన్‌పై వైమానిక దాడులు..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ రాజధాని ట్రెహాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్‌కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా మాటను వినేందుకూ ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. వందల బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి. Iran had no idea we were coming. They were completely blind. The Israeli strike caught ALL the Iranian commanders in bed. Not a single warning signal was activated. pic.twitter.com/oLLyt1JhDs— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) June 13, 2025ఇజ్రాయెల్ దాడులపై నెతన్యాహు ప్రకటన..ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని నెతన్యాహు ప్రకటనఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను టార్గెట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైంది.ఎన్ని రోజులైన ఆపరేషన్ కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి!Benjamin Netanyahu full statement on Iran's attack:"We struck at the heart of Iran's nuclear enrichment program, Iran's nuclear weaponization program, Iran's main enrichment facilities, leading nuclear scientists, and ballistic missile programs."pic.twitter.com/EBGMLi23Aj— Vivid.🇮🇱 (@VividProwess) June 13, 2025ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌లోని ఓ ప్రాంతంలో శుక్రవారం భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఈ మేరకు ఇరాన్‌లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ దాడులు జరిగాయని సమాచారం. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది.మరోవైపు.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ సహా సైనికులను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్టు సమాచారం. 🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ.. మరోవైపు ఇజ్రాయెల్‌లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ లో తాము దాడులు నిర్వహించామని.. దీని కారణంగా ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు. ఇక ఇరాన్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. Iran is the enemy but this is not our fightThey chant "death to America" all the time but two things can be true at once. This is not our fight If you're screaming for Trump to send our troops to die in an Israel-Iran war, grab a gun and go fight it yourself! Drag your own… pic.twitter.com/ZnCkqZHu2q— Terrence K. Williams (@w_terrence) June 13, 2025 అమెరికా స్పందన..ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. టెహ్రాన్ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.Here we go. Israel has just struck Tehran, Iran.The United States should NOT get involved in this!No more wars!pic.twitter.com/ngTAn1AEKs— Steve 🇺🇸 (@SteveLovesAmmo) June 13, 2025