ఇరాన్‌లో విషపూరిత పొగలు.. హెచ్చరికలు జారీ | US And Israel-Iran War Live Updates 7th March | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌లో విషపూరిత పొగలు.. హెచ్చరికలు జారీ

దుబాయ్‌ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన ఎమిరేట్స్‌

  • దుబాయ్‌ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన ఎమిరేట్స్‌
  • ఎయిర్‌పోర్టుకు రావద్దని ప్రయాణికులకు ఎమిరేట్స్‌ సూచన
  • ఇరాన్‌ క్షిపణుల, డ్రోన్లను అడ్డుకున్న యూఏఈ వైమానిక దళం
  • భద్రత కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు బంద్‌
  • తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్‌ వచ్చే, వెళ్లే అన్ని విమానాలు రద్దు
     
2026-03-07 14:52:56

అరబ్‌ దేశాలకు ఇరాన్‌ క్షమాపణలు

  • గల్ఫ్‌ దేశాలకు క్షమాపణ చెప్పిన ఇరాన్‌ అధ్యక్షుడు
  • పొరుగు దేశాలపై దాడులు చేయబోమన్న ఇరాన్‌
  • అరబ్‌ దేశాలు మా సోదరులవంటివారన్న ఇరాన్‌
2026-03-07 14:22:44

దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై మరో మిస్సైల్‌ దాడి

దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ భీకర దాడులు
వెంటనే అప్రమత్తం అయిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు

 

2026-03-07 14:18:47

ఇరాన్ ప్రెసిడెంట్ కీలకప్రకటన

  • పక్కదేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్ 
  • ఇకపై పక్కదేశాలపై దాడి చేయం
  • మీరు మా జోలికి రాకుంటే మేము మీ జోలికి రాము
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు ఎట్టిపరిస్థితుల్లో లొంగేది లేదు
     
2026-03-07 13:52:58

ఇరాన్‌లో విషపూరిత పొగలు..

  • ఇరాన్‌ మెహ్రాబాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడులు.
  • మెహ్రాబాద్‌ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.
  • ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న షహరాక్‌ ఎక్బాతన్‌ అపార్ట్‌మెంట్‌.
  • పెట్రోలియం, ఆయిల్‌ నిల్వలు దగ్దమవడంతో దట్టమైన పొగలు.
  • నాలుగు రోజులుగా ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు.
  • టెహ్రాన్‌లోని ప్రెసిడెన్షియల్‌ ఆఫీసు, ఇతర భవనాలపై దాడి.
  • మెహ్రాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో హెచ్చరికలు.
  • షహరక్‌ ఎక్బాతన్‌ అపార్ట్‌మెంట్‌ వాసులకు హెచ్చరికలు జారీ.
  • భారీగా వెలువడుతున్న విషపూరిత పొగలు.
  • ఇంధనం, ఆయిల్‌ దహనంతో విషపూరిత పొగలు: ది టైమ్స్‌ వెల్లడి.
  • ఇళ్లలోనే ఉండాలని, బటయకు రావొద్దని అధికారుల సూచన.  
2026-03-07 12:24:01

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు..

  • లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్‌
  • బీరుట్‌ దహియెహ్‌ జిల్లాలో హెజ్‌బొల్లా, ఇరాన్‌ విప్లవ గార్డ్స్‌ (IRGC) కీలక కమాండ్‌ సెంటర్లపై దాడులు.
  • IRGC ఎయిర్‌ ఫోర్స్ కమాండ్‌ సెంటర్‌పై దాడి.
  • హెజ్‌బొల్లా నేవీ యూనిట్ కమాండ్‌ సెంటర్‌పై దాడి.
  • హెజ్‌బొల్లా ఫైనాన్షియల్ యూనిట్ కమాండ్‌ సెంటర్‌పై అటాక్‌.
  • హెజ్‌బొల్లా ఆపరేటింగ్ కౌన్సిల్ కమాండ్‌ సెంటర్‌పై దాడి.
  • ఈ కేంద్రాలు ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్‌, అమలు చేయడానికి ఉపయోగించినట్టు ఐడీఎఫ్‌ ప్రకటన
  • ఇరాన్‌ తరఫున హెజ్‌బొల్లా దాడులు చేస్తోందని ఐడీఎఫ్‌ ఆరోపణ.
  • ఈ దాడులు హెజ్‌బొల్లా సైనిక, ఆర్థిక, ఆపరేషనల్ సామర్థ్యాలను బలహీనపరచడమే టార్గెట్‌.
2026-03-07 11:50:16

ఇరాన్‌, అమెరికా వార్.. క్షిపణుల వర్షం

  •   ఇరాన్ ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా చేస్తామన్న అమెరికా
  •  యూరప్‌, అమెరికా వాసులకు సురక్షిత ప్రాంతంగా మారుస్తాం
  • ఇరాన్‌ కోసం పోరాడిన వారి కోసం ఈ ప్రాంతాన్ని సేఫ్‌ ప్లేస్ చేస్తాం
     
2026-03-07 11:41:29

తీవ్ర ఉద్రిక్తతలకు యుద్ధం

  •  మధ్యదరా సముద్రంలో యుఎస్‌ యుద్ధనౌకలు
  • వేగంగా కదులుతున్న USS జార్జ్‌, HW బుష్ నౌకలు
  • రెడ్‌ సీలోకి ప్రవేశించిన యుఎస్‌ గెరాల్డ్ యుద్ధనౌక
2026-03-07 11:33:07

ఇరాన్‌లో భూకంపం

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, యూఎస్‌ దాడులు కొనసాగుతున్న వేళ భూ ప్రకంపనలు.
  • ఇరాన్‌లోని బాండార్‌ అబ్బాస్‌ ప్రాంతంలో భూకంపం.
  • రిక్టార్‌ స్కేలుపై 4.1 తీవ్రతతో భూ ప్రకంపనలు.
  • మంగళవారం కూడా ఇరాన్‌లోలో 4.3 తీవ్రతతో భూకంపం. 
2026-03-07 10:19:19

ట్రంప్‌నకు యూఎస్‌ కాంగ్రెస్‌లో మద్దతు

  • ఇరాన్‌పై దాడులు చేయిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఎస్‌ కాంగ్రెస్‌లో మద్దతు
  • దాడులను ఆపేందుకు ఉద్దేశించిన తీర్మానం ఏడు ఓట్ల తేడాతో వీగిపోయిన వైనం
  • తీర్మానానికి అనుకూలంగా 212 ఓట్లు 
  • తీర్మానానికి వ్యతిరేకంగా 219 ఓట్లు  
     
2026-03-07 10:11:54

ఇరాన్‌పై భూతల దాడులకు రెడీ: కుర్దులు

  • ఇరాన్‌పై దాడులకు సిద్ధమన్న ఇరాక్‌ సాయుధ కుర్దు గ్రూపులు
  • అమెరికా భారీ భూతల దాడులు చేస్తే తాము సహకరిస్తామన్న కుర్దు గ్రూప్‌.
  • కుర్దిస్తాన్‌ ఫ్రీడం పార్టీకి చెందిన ఖలీల్‌ నాదిరి ప్రకటన.
  • అమెరికా, ఇజ్రాయెల్‌తో తాము టచ్‌లోనే ఉన్నట్టు వెల్లడి.
  • తమ సాయుధ దళాలు కొన్నాళ్లుగా ఇరాన్‌లో పోరాటం చేస్తూనే ఉన్నాయని ప్రకటన.
  • కుర్దిష్‌ గ్రూపులు యుద్ధంలోకి దిగితే ఇరాన్‌ తమను కూడా లక్ష్యం చేసుకుంటుందని ఇరాక్‌ ఆందోళన. 
     
2026-03-07 09:17:43

ఇరాన్‌ ఎయిర్‌పోర్టులో ఇజ్రాయెల్‌ దాడులు..

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి.
  • ఇరాన్‌లోని మెహరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్‌ దాడులు.
  • ఒక్కసారిగా మంటలు చెలరేగి.. విమానాశ్రయం ధ్వంసం. 
2026-03-07 08:57:53

ఇజ్రాయెల్‌కు బిగ్‌ షాక్‌..

  • ఇజ్రాయెల్‌ దాడిని తప్పుబట్టిన లెబనాన్‌, ఫ్రాన్స్‌, ఘనా.
  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై ప్రజల అసంతృప్తి.
  • ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు.
  • టెల్‌ అవీవ్‌, జెరూసలెంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలు.  

 

2026-03-07 08:32:57

దాడులు పెంచిన ఇరాన్‌..

  • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు.
  • ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ క్షిపణుల ప్రయోగం.
  • టెల్‌ అవీవ్‌లో కుప్పకూలిన భారీ భవనాలు.
  • ఆయుధ నిల్వల స్థావరంతో పాటు టెల్‌ అవీవ్‌ పోర్టుపైనా దాడి.
  • ఇరాక్‌లోని అమెరికన్‌ కంపెనీలను టార్గెట్‌ చేసిన ఇరాన్‌.
  • హలీబుర్టన్‌, కేబీఆర్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలపై డ్రోన్‌ దాడులు.
  • ఎర్బిట్‌లోని అరజాన్‌ హోటల్‌, అమెరికా మిలటరీ బేస్‌పైనా అటాక్‌.
  • దుబాయ్‌లోని అమెరికా కమాండ్‌ సెంటర్‌పై ఇరాన్‌ క్షిపణి అటాక్‌.
  • లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి శాంతి దళాలపై దాడి.
  • ఘనాకు చెందిన యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ హెడ్‌ ఆఫీసుపై క్షిపణి దాడులు.

 

 

2026-03-07 08:32:57

ఎయిరిండియా కీలక ప్రకటన

  • గల్ఫ్ నుంచి విమానాలు కొనసాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన
  • జెడ్డా, మస్కట్ నుంచి షెడ్యూల్ సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిరిండియా వెల్లడి
  • అబుదాబి, దుబాయ్‌, మస్కట్, రస్‌అల్‌ఖైమా, షార్జా నుంచీ నడుపుతామని వెల్లడి
  • ప్రత్యేక విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా ప్రకటన
  • గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చేందుకే విమానాలు నడుపుతున్నట్లు వెల్లడి
  • అమెరికా, యూరప్‌కు సురక్షిత మార్గాల్లో సర్వీసులు కొనసాగిస్తున్నట్లు వెల్లడి
2026-03-07 07:58:45

రెండో వారానికి చేరిన యుద్ధం

  • మధ్యప్రాచ్యంలో రెండో వారానికి చేరిన యుద్ధం
  • ఇరాన్‌లోని అణు, క్షిపణి కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం
  • 400కుపైగా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటన
  • బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు
  • టెహ్రాన్‌లోని ఆజాదీ టవర్ సమీపంలో ఇజ్రాయెల్‌ దాడులు
  • ఇరాన్‌ నౌకాదళాన్ని నిర్వీర్యం చేసినట్లు తెలిపిన అమెరికా.
2026-03-07 07:58:45
Advertisement
 
Advertisement
Advertisement