‘ఇజ్రాయెల్‌ దాడులు’.. ఇరాన్‌లోని భారతీయులకు అడ్వైజరీ | Embassy Of India In Iran Posts An Advisory For Indian Nationals Amid Israel Strikes In Iran, Check Post Inside | Sakshi
Sakshi News home page

‘ఇజ్రాయెల్‌ దాడులు’.. ఇరాన్‌లోని భారతీయులకు అడ్వైజరీ

Jun 13 2025 8:41 AM | Updated on Jun 13 2025 11:36 AM

Embassy of India in Iran posts an advisory for Indian nationals

ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భయానక దాడులు చేస్తోంది. ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. ట్విట్టర్‌ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అడ్వైజరీలో పేర్కొంది.

మరోవైపు.. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌ విమాన రాకపోకలపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశాలకు, ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎయిర్‌ లైన్స్‌ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement