
మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది.

ఇంతటి భయానక పరిస్థితుల నేపధ్యంలో హవాయిలోని హోనోలులులో తన ఇంటి వదిలి వెళ్ళడానికి తాను ఎందుకు నిరాకరిస్తున్నానో వివరించే టిక్‌టాక్ వీడియోను ఒక మహిళ షేర్ చేసింది.

సునామీ హెచ్చరికల నేపధ్యంలో సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు తన పసిబిడ్డను ఎత్తుకుని 15 నుండి 20 నిమిషాలు నడవాల్సి ఉంటుందని షెల్బీ కె బ్లాక్‌బర్న్ అనే మహిళ తన టిక్‌టాక్ వీడియోలో వివరించింది.

సునామీ తాకనున్నదనే భయంతో స్థానికులు, సందర్శకులు హవాయి నుంచి అలా వే హార్బర్, వైకికి, ఓహులకు కార్లలో చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని షెల్బీ కె బ్లాక్‌బర్న్ తెలిపింది.





















