
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్‌డేట్స్
అణు ధార్మికత విడుదలైందా?
- ఇరాన్ న్యూక్లియర్ సెంటర్‌లపై ఇజ్రాయెల్ దాడులు
- కీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్
- అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడా
- దీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారం
- ఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ
- ఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణ
- అణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన
ఒక్క విమానం తిరగట్లేదు!!
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలం
- ఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం
- విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్‌రాడర్24
As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights.
NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025
ఇరాన్ ఎయిర్ డిఫెన్స్‌పై దాడి పూర్తి!
- ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్
- ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన
- ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్
- ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణం
- ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
- ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన
- రెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణ
- అయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్
- దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచన
- అంతకు ముందు.. ఇరాన్‌లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ
👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
- ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
- వంద డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యం
- డ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్
- ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్
- ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం
- ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీ
- గంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్
- ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియా

ఆపరేషన్ రైజింగ్ లయన్‌పై నెతన్యాహు కీలక ప్రకటన
- ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులు
- మళ్లీ రగులుతున్న పశ్చిమాసియా
- ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన
- ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్య
- ఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాం
- నంతాజ్‌లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాం
- టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాం
- అగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం
- ఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్
- ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీ
- ఇరాన్‌ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదు
- ముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు

1980 తర్వాత..
- ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు
- ఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం
- అణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు
- 1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదే
- ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతి
- దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం
#BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT
— AFP News Agency (@AFP) June 13, 2025
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ
- ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతి
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ
- కఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ
With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.
— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025
ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు
- దాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపు
- ఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.

దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్
- ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్
- దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్
- ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్య
ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభం
- ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్
- ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- ఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణ
- ఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా