
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్‌లైన్‌పై ఇప్పుడు ఆ రెండు(అమెరికా-రష్యా) దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువును యూఎస్ రిపబ్లిక్ సెనేటర్ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్ గడువును రష్యా సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుటం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్‌ను కోడ్ చేస్తూ మెద్వెదేవ్ కౌంటరిచ్చారు.

To those in Russia who believe that President Trump is not serious about ending the bloodbath between Russia and Ukraine:
You and your customers will soon be sadly mistaken. You will also soon see that Joe Biden is no longer president.
Get to the peace table. https://t.co/IRWk9I0Ljf— Lindsey Graham (@LindseyGrahamSC) July 28, 2025
ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిలో లేక ఇరాన్ దేశమో కాదు. 50 రోజులు లేదా 10... అని కాదు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్ గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేస్తున్నది రష్యాపైనో, ఉక్రెయిన్ పైనో యుద్ధం కాదు. వేరే పరిణామాలకు దారి తీయొచ్చు(మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని సంకేతాలిస్తూ) ’ అంటూ ఘాటుగా స్పందించారు మెద్వెదెవ్.
రష్యాకు 50 రోజుల సమయమే
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాలు ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో నాటో చీఫ్ మార్క్ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు.