
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. లండన్ మేయర్‌ను దుష్టుడు అని, అతను చేయకూడని పనిచేశాడని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో లండన్‌కు రావాలనుకుంటున్నారా? అని ట్రంప్‌ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన తానేమీ మీ మేయర్ అభిమానిని కాదని, అతను చేయకూడని పనిచేశాడని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
సోమవారం స్కాట్లాండ్‌లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై మాటల దాడి చేశారు. కాగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యధిక జనాభా కలిగిన లండన్‌కు మొదటి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. రాజకీయ ప్రత్యర్థులు తన మతాన్ని విమర్శించిన సందర్బాల్లో సాదిక్ ఖాన్ ఎదురుదాడికి దిగుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాదిక్ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు.
అయితే సాదిక్ ఖాన్ తాను ఇటువంటి విమర్శలను పట్టించుకోనని గతంలోనే స్పష్టం చేశారు. 2016, మే 9న ఖాన్ లండన్ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.. సాదిక్ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. ‘గుడ్ మార్నింగ్’ బ్రిటన్’లో ఖాన్‌ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు.