ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్‌ మస్క్‌.. యూటర్న్‌ ఇలా.. | Regret Some of my Posts Musk Blinks in Fight with Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్‌ మస్క్‌.. యూటర్న్‌ ఇలా..

Jun 11 2025 1:50 PM | Updated on Jun 11 2025 3:04 PM

Regret Some of my Posts Musk Blinks in Fight with Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది.  

బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్‌లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్‌ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్‌’లో రాశారు.
 

ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు  మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు  సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్‌ ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే,  తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్‌ను  హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్‌ ‘ప్లాన్‌ బీ’

Advertisement
 
Advertisement
Advertisement