కాల్పుల విరమణకు దిగిరాకుంటే ప్రత్యేక పాలస్తీనాకు  ఐరాసలో మద్దతిస్తాం | UK to recognise Palestinian state unless Israel meets conditions | Sakshi
Sakshi News home page

కాల్పుల విరమణకు దిగిరాకుంటే ప్రత్యేక పాలస్తీనాకు  ఐరాసలో మద్దతిస్తాం

Jul 30 2025 5:40 AM | Updated on Jul 30 2025 5:40 AM

UK to recognise Palestinian state unless Israel meets conditions

లండన్‌: పాలస్తీనా విషయంలో ఫ్రాన్స్‌ దారినే బ్రిటన్‌ సైతం అనుసరిస్తోంది.  కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించకుంటే ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు వచ్చే సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతిస్తామని బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇజ్రాయెల్‌ చర్యలు తీసుకోకుంటే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఆయన ప్రకటించారు. 

అదే సమయంలో, హమాస్‌ తన వద్ద ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసి, ఆయుధాలను అప్పగించాలన్నారు. భవిష్యత్తులో గాజాలో ఎటువంటి భూమిక పోషించబోమనే హామీని హమాస్‌ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇదే సరైన అదను అని స్టార్మర్‌ తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సైతం రెండు దేశాల విధానానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement