ట్రంప్‌ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా | Will cope with new sanctions Russia on Trumps tariff threat | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా

Jul 15 2025 8:12 PM | Updated on Jul 15 2025 9:26 PM

Will cope with new sanctions Russia on Trumps  tariff threat

బీజింగ్‌:  వచ్చే 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, వంద శాతం సుంకాలను ఆ దేశం ఎదుర్కోవాల్సి  ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈరోజు(మంగళవారం, జూలై 15) షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సమ్మిట్‌కు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌ ప్రెస్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడారు. 

దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ విధిస్తామన్న సుంకాలపై కాస్త​ వ్యంగ్యంగా బదులిచ్చారు లావ్రోవ్‌. ‘ ట్రంప్‌ సుంకాలు వేస్తానన్నారు కదా.. అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు. వేయనీయండి.. మేము భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి’ అంటూ బదులిచ్చారు. 

పుతిన్‌.. నీకు 50 రోజుల సమయమే
కాగా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..  వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు.  ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు.  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.  

‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి.  యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి.  రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే  పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.  వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు. 

 ఇదీ చదవండి:

ట్రంప్‌-పుతిన్‌ బ్రొమాన్స్‌ ముగిసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement