breaking news
Nuclear plants
-
ఆ 3 అణు కేంద్రాలు
ఇరాన్‌లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా...1.ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ టెహ్రాన్‌కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో పర్వతం అంతర్భాగంలో 90 మీటర్ల లోతున ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. నతాంజ్ కంటే ఇది పరిమాణంలో చిన్నదే. వైమానిక దాడుల నుంచి రక్షణతోపాటు అణుపరీక్షల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో కొండ దిగువన దుర్భేద్యంగా నిర్మించారు. ఫోర్డోను ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఇది పటిష్ట స్థితిలో ఉండడంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో అత్యాధునిక సెంట్రీఫ్యూజ్‌లను బిగించే సామర్థ్యం కలిగి ఉండడం. ఫోర్డోలో సైతం 60 శాతం శుద్ధి చేసిన యురేనిజం నిల్వలున్నాయి. ఈ అణుకేంద్రంపై అమెరికా సైన్యం బి–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ద్వారా 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ (జీబీయూ–57) బాంబును ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి వల్ల ఫోర్డోకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వత ప్రాంతం భారీగా దెబ్బతినడంతోపాటు రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అమెరికా దాడి చేయడం తథ్యమన్న ముందస్తు అంచనాతో ఫోర్డో నుంచి యురేనియం, సెంట్రీఫ్యూచ్లు, కీలక పరికరాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయ దిశలో 135 మైళ్ల దూరంలో నతాంజ్ అణుకేంద్రం ఉంది. ఇరాన్‌కు ఇదే అత్యంత ముఖ్యమైన యురేనియం శుద్ధి, నిల్వ కేంద్రం. అణు కార్యక్రమంలో నతాంజ్దే కీలక పాత్ర. అమెరికా దాడుల కంటే ముందు ఇక్కడ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వచేశారు. అణు బాంబు తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం. అంటే అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా సమీపంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా దాడుల కంటే ముందే ఇజ్రాయెల్ సైన్యం నతాంజ్‌పై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో భూఉపరితలంపై ఉన్న మౌలిక సదుపాయాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. భూఅంతర్భాగంలో ఉన్న పటిష్ట స్థితిలో సదుపాయాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, అమెరికా దాడుల్లో నతాంజ్‌లోని సెంట్రీఫ్యూజ్‌లు, ఇతర పరికరాలు చాలావరకు నామారూపాల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. నతాంజ్‌పై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. అవి సఫలం కాలేదు. నతాంజ్‌కు సమీపంలోని పికాక్స్ అనే పర్వతం కింద మరో భారీ అణుకేంద్రాన్ని నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు గతంలో వార్తలొచ్చాయి.3. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ టెహ్రాన్‌కు ఆగ్నేయ దిశలో 215 మైళ్ల దూరంలోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్లో యురేనియం కన్వర్షన్ సదుపాయాలు, ల్యాబ్‌లు, చైనా తయారీ రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది అణు శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడికి దిగడంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ, అమెరికా దాడిలో భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్‌లో రేడియేషన్ లీకేజీ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ప్రకటించింది.ఇరాన్‌లోని మరికొన్ని అణు కేంద్రాలు (ఇక్కడ దాడులు జరగలేదు) బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరాన్లో ఇదొక్కటే కమర్షియల్ అటామిక్ రియాక్టర్. పర్షియన్ గల్ఫ్‌లో ఏర్పాటు చేశారు. రష్యా సరఫరా చేస్తున్న యురేనియంతో ఇక్కడ అణ్వస్త్ర తయారీ పరిశోధనలు జరుగుతుంటాయి.అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పెవన్స్–గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నెలకొల్పారు. 2015లో ఈ కేంద్రాన్ని పాక్షికంగా ఆధునీకరించారు.టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్‘శాంతి కోసం అణుశక్తి’ అనే కార్యక్రమంలో భాగంగా 1967లో అమెరికా సరఫరా చేసిన టెక్నాలజీ, పరికరాలతో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తక్కువ శుద్ధి చేసిన యురేనియంతో అణు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి కూడా...→ కరాజ్ (అణు పరిశోధన కేంద్రం) → దార్కోవిన్(నిర్మాణంలో ఉన్న అణుకేంద్రం) → అనారక్(అణు పరిశోధన కేంద్రం) → అర్దాకన్(అణు పరిశోధన కేంద్రం) → సఘాంద్(యురేనియం మైన్) – సాక్షి, నేషనల్ డెస్క్ -
25నిమిషాల్లో ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సైన్యానికి ఇరాన్లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామ ర్లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు ‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్‌పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు. కొద్దిమందికే తెలుసు ఇరాన్‌పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్‌కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్ ఇరాన్‌పై ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్‌ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్‌తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్వాషింగ్టన్: ఇరాన్లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్హౌస్లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్‌కు తేల్చిచెప్పారు.ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూజెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్‌పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్‌కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.బాధ్యతారాహిత్యంఅమెరికాపై రష్యా ధ్వజంమాస్కో/బీజింగ్: ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్‌ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది. -
బాహుబలి బాంబు
ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్ బస్టర్ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్ బస్టర్ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. బాంబు బరువు 13,600 కిలోలుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుతారు. మెరుపువేగంతో దూసుకొచ్చి..ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్‌హెడ్‌లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్‌చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్సోనిక్ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్‌లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. బాంబుకు తగ్గ విమానంఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్రోప్ గ్రూమ్మన్ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆపరేషన్ రైజింగ్ లయన్.. రేడియేషన్ రిలీజ్ అయ్యిందా?
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్డేట్స్అణు ధార్మికత విడుదలైందా?ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులుకీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడాదీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారంఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణఅణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన ఒక్క విమానం తిరగట్లేదు!!ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలంఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్‌రాడర్24As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights. NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్‌పై దాడి పూర్తి!ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్‌లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్వంద డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యండ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్ రైజింగ్ లయన్‌పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతిదాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతిఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభంఇరాన్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి. -
‘అణు’ కేంద్రం ధ్వంసం చేస్తాం
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగానే అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. ఈ నెల 23–25 తేదీలలో విదేశీ మీడియా ఎదురుగా పేలుడు పదార్థాలతో పుంగ్యే–రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, సొరంగ మార్గాలు, అణ్వాయుధ సంస్థ, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అమెరికా ప్రకటన చేసిన మర్నాడే... ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే.. ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటనను స్వాగతించింది. కిమ్ మాటలు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. -
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా
బీజింగ్: చైనా అన్నంత పనిచేస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చెల్లబోదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిజంగానే భేఖాతరు చేస్తోంది. త్వరలోనే ఆ సముద్రంపై చైనా అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందట. ఈ విషయాన్ని అక్కడి మీడియా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన రెండు రోజులకే చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరోసారి కయ్యానికి కాలు దువ్వడమేనని తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకంటే తమకే పెత్తనం ఉందని అటు చైనా, ఫిలిప్పీన్స్ ది హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లగా ట్రిబ్యునల్ మాత్రం పిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చైనాకు ఎలాంటి పెత్తనం లేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. అయితే, తాము ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోబోమని, తాము చేసేది చేస్తామని చైనా ప్రకటించింది. అన్నట్లుగానే ఓ మీడియా ద్వారా తాము అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామని, వాటి వల్ల దక్షిణ చైనా సముద్రంపై ప్రభావవంతమైన పట్టుసాధిస్తామని చెబుతోంది. ఒక వేళ ఇదే జరిగితే అంతర్జాతీయ సమాజంతో చైనా మరోసారి విమర్శలపాలు కాక తప్పదు. -
ఏపీలో ఎన్పీసీఐఎల్ అణువిద్యుత్ ప్లాంటు!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తిరస్కరించిన అణు విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐఎల్) ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీలో తగిన స్థలం కోసం అన్వేషిస్తోంది. నిజానికి బెంగాల్‌లోని హరిపూర్ పట్టణంలో ఎన్పీసీఐఎల్ ఈ అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గతంలో తలపెట్టింది. అయితే స్థానిక రైతులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదిత 6వేల మెగావాట్ల ఈ విద్యుదుత్పత్తి ప్లాంటుకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్పీసీఐఎల్ దృష్టి తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీనిపై ఎన్పీసీఐఎల్ బోర్డు సభ్యుల్లో ఒకరైన బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ శేఖర్ బసు శనివారం కోల్‌కతాలో మాట్లాడుతూ హరిపూర్‌లో ప్రతిపాదించిన అణువిద్యుత్ ప్లాంటు తరహాదానిని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రానికి చెందిన కోస్తా తీర ప్రాంతంలో భూమికోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. తగిన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని బసు వెల్లడించారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కోరుకున్నట్లయితే హరిపూర్‌లో ఏ సమయంలోనైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.