ఇరాన్‌కు భారీ షాక్‌.. ఆర్మీ చీఫ్‌, అణు శాస్త్రవేత్తలు మృతి! | Know About The Details Of Iran's Paramilitary Revolutionary Guard Chief Hossein Salami In Telugu | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు భారీ షాక్‌.. ఆర్మీ చీఫ్‌, అణు శాస్త్రవేత్తలు మృతి!

Jun 13 2025 8:49 AM | Updated on Jun 13 2025 11:36 AM

Iran Revolutionary Guards Chief Hossein Salami Details

జెరూసలెం: పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై ఒక్కసారిగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.

ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు చేసింది. ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక, ఇజ్రాయెల్‌ దాడుల్లో.. ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.  భీకర దాడుల్లో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ మరణించినట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర టాప్‌ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. 
 

ఇరాన్‌పై కొద్ది రోజుల్లోనే దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా సాయం లేకుండానే ఈ దాడులు జరగనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా దాడులు చేస్తామని ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నజీర్జాదే తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్‌పై వందల బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని స్పష్టంచేశారు.

 అమెరికా అప్రమత్తం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తమ సైనిక, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని సిబ్బందిని తగ్గించాలని సూచించారు. బహ్రెయిన్, కువైట్‌లలోనూ అత్యవసరం కాని సిబ్బందిని తగ్గించాలని ఆదేశించారు. వారంతా ఆయా దేశాలను వీడేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement