
మూసాపేట: హైదర్‌నగర్ ప్రధాన రహదారి ధర్మారెడ్డికాలనీలోని ఓ షోరూంలో బుధవారం సినీ నటులు, మోడల్స్ సందడి చేశారు. కూకట్‌పల్లి శాఖ షోరూంలో 62వ వార్షికోత్సవం సందర్భంగా సినీ నటి వర్షిణి సౌంద్యరాజన్, మిస్ ఇండియా తెలంగాణ ఫేమ్ ఊర్మిళ చౌహన్, ఇతర మోడల్స్ పాల్గొని నూతన కలెక్షన్స్‌ను ప్రారంభించి, వాటిని ధరించి హొయలు పోయారు.












