
సురక్షితంగా బయటపడ్డ పైలట్
కాలిఫోర్నియా: అమెరికాలో నేవీ యుద్ధ వి మానం ఎఫ్–35సీ కూలిపోయింది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని లెమూర్‌లో ఉన్న నేవీ ఎ యిర్ స్టేషన్ సమీపంలో అమెరికా కాలమా నం ప్రకారం బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే.. శిక్షణలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. విమానంలో అదనపు సిబ్బంది ఎవరూ లేరు.
రెస్యూ్క టీమ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టింది. అయితే.. జెట్ కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. జెట్ కూలిపోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం క్రాష్ కాగానే జెట్ శిథిలాల నుంచి భారీగా మంటలు ఎగసిపడు తున్నాయి. ఆ ప్రాంతమతా నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. ఏ మేరకు నష్టం సంభవించింది? బేస్ కార్యకలాపాలపై ప్రభావం పడిందా? అనే విషయాలను నేవీ వెల్లడించలేదు.
United States military f-35 jet has crashed and burst into flames at Lemoore Naval Airstation pic.twitter.com/ReohO7lGx2
— Osaka James🇺🇸 (@osakajayms) July 31, 2025
నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్, సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టెల్త్ ఫైటర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన వాటిలో ఒకటి. దీని ధర దాదాపు 115 మిలియన్లు డాలర్లు ఉంటుంది. అమెరికా రక్షణ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇది మల్టీరోల్ యుద్ధ విమానం. ఇది వైమానిక ఆధిపత్యం, గ్రౌండ్ అటాక్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌తో సహా విస్తృత శ్రేణి మిషన్ల ప్రయోగం కోసం రూపొందించారు. ఈ విమానం అధునాతన స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్లు, అత్యాధునిక ఏవియానిక్స్‌ను కలిగి ఉంది. ఇటీవల, వాతావరణం అనుకూలించక, తక్కువ ఇంధనం కారణంగా బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్35బీ వేరియంట్ కేరళలో నెలరోజులపైగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.