ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఎయిర్‌ఫోర్స్‌లో కీలకంగా భావిస్తున్న ఎఫ్-14 ఫైటర్ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.
ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్‌తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్‌కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది.
అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.
ఎఫ్-14 ప్రత్యేకతలు
ఎఫ్-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి. అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్‌గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.


