చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్‌లు | Donald Trump Threatens More Tariffs on India if Putin Talks Fail | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలమైతే  మరిన్ని టారిఫ్‌లు

Aug 15 2025 4:21 AM | Updated on Aug 15 2025 4:21 AM

Donald Trump Threatens More Tariffs on India if Putin Talks Fail

భారత్‌కు అమెరికా హెచ్చరిక 

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్, పుతిన్‌ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్‌ బెసెంట్‌ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్‌ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్‌లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్‌పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. 

రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్‌లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్‌ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్‌ ఉత్పత్తులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement